Telangana: మరి కాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన కూతురు.. అంతలోనే ఊహించని ఘటన..

|

Mar 17, 2023 | 6:02 PM

ఇల్లంతా సందడి.. మరి కాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన కూతురు..అప్పటివరకు సంతోషం గా పెళ్లి పనుల్లో నిమగ్నం అయిన తండ్రి.. అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు.

Telangana: మరి కాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన కూతురు.. అంతలోనే ఊహించని ఘటన..
Khammam Father Dies
Follow us on

ఇల్లంతా సందడి.. మరి కాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన కూతురు..అప్పటివరకు సంతోషం గా పెళ్లి పనుల్లో నిమగ్నం అయిన తండ్రి.. అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దాంతో ఆ పెళ్ళింట తీవ్ర విషాదం నెలకొంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామంలో విషాదం నెలకొంది. శనివారం ఉదయం కూతురు పెళ్లి జరగాల్సి ఉండగా.. తండ్రి గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. తండ్రి మరణించడంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మరోవైపు తండ్రి మరణంతో మరికొన్ని గంటల్లో జరగాల్సిన కూతురు పెళ్లి ఆగిపోయింది.

ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రానికి చెందిన అర్జున్.. వీఆర్వో గా పని చేస్తున్నాడు. ఇటీవల ప్రభుత్వం వీఆర్వో లను వేరే శాఖలకు బదిలీ చేయడంతో అర్జున్‌ను ఆరోగ్య శాఖకు కేటాయించారు. అయితే, ఇటీవలే అర్జున్ కుమార్తె కు వివాహం నిశ్చయం కాగా శనివారం ఉదయం వివాహం జరగాల్సి ఉంది. అర్జున్ పెళ్లి హడావుడిలో ఉండగానే శుక్రవారం తెల్లవారు జామున గుండె పోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఆయన్ని గమనించి ఆసుపత్రికి తరలించేలోపే అర్జున్ మృతి చెందాడు. దాంతో ఆయన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

ఇల్లంతా సందడి.. అంతలోనే విషాదం..

అమ్మాయి పెళ్లి కావడంతో తండ్రి అర్జున్ ఇంట్లో గ్రాండ్‌గా ఏర్పాట్లు చేశాడు. దాంతో ఇళ్లంతా సందడి నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అంతా ఇంటికి రావడంతో ఇల్లంతా కోలాహలంగా మారింది. వారందరినీ చూస్తూ సంతోషంగా ఉన్న అర్జున్.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దాంతో అప్పటి వరకు కోలాహలంగా ఉన్న ఇల్లు.. ఆర్తనాదాలతో కకావికలం అయ్యింది. ఇల్లంతా విషాదఛాయలు అలముకున్నాయి. ఇక ఆ గ్రామంలోనూ అదే పరిస్థితి నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..