Guinness World Record: తన సృజనాత్మకతతో గుర్తుంపు పొందాలనుకున్నాడు. రైతు కష్టానికి గుర్తింపు ఇవ్వాలనుకున్నాడు. ఎలుకల నివారణకు వినూత్న పరికరాన్ని రూపొందించి చరిత్ర సృష్టించాడు తెలంగాణకు చెందిన యువకుడు.
జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్‌కు గిన్నిస్ బుక్‌లో చోటుదక్కింది. అతి చిన్నసైజులో ఎలుకల బోను నమూనాను సృష్టించిన దయాకర్ కృషిని గిన్నిస్ సంస్థ గుర్తించింది. 5 మిల్లీమీటర్ల పొడవు, 2.5 మిల్లీమీటర్ల వెడల్పుతో 29 నిమిషాల్లోనే ఈ బోనును రూపొందించడం విశేషం. అయిదేళ్ల క్రితం ఓ భారతీయుడు గంటలో సూక్ష్మ బోనును తయారుచేయగా.. దయాకర్ ఆ రికార్డును అధిగమించారు. గత డిసెంబరు 2న అధికారుల సమక్షంలో నిబంధనల మేరకు బోనును తయారు చేసి పంపాడు.. తాజాగా గిన్నిస్ రికార్డు వరించిందని దయాకర్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..