Telangana Lok Sabha Election Results: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీల గెలుపోటములు.. ఒక్క క్లిక్‌తో పూర్తి వివరాలు

Telangana Lok Sabha Polls Results Highlights: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ సత్తాచాటాయి. ఆ రెండు పార్టీలు తలా 8 నియోజకవర్గాల్లో గెలిచాయి. అయితే పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్‌ ఏ ఒక్క స్థానంలోనూ ప్రభావం చూపలేకపోయింది. విజయం ఖాయమని భావించిన మెదక్ స్థానంలోనూ బీజేపీ విజయం సాధించింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన టాప్ హైలైట్స్ ఇవే..

Telangana Lok Sabha Election Results: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీల గెలుపోటములు.. ఒక్క క్లిక్‌తో పూర్తి వివరాలు
Telangana Lok Sabha Election 2024 Results

Updated on: Jun 04, 2024 | 6:31 PM

Telangana Lok Sabha Polls 2024 Results: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ సత్తాచాటాయి. ఆ రెండు పార్టీలు తలా 8 నియోజకవర్గాల్లో గెలిచాయి. అయితే పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్‌ ఏ ఒక్క స్థానంలోనూ ప్రభావం చూపలేకపోయింది. విజయం ఖాయమని భావించిన మెదక్ స్థానంలోనూ బీజేపీ విజయం సాధించింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన టాప్ హైలైట్స్ ఇవే..

  1. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఎనిమిది, బీజేపీ ఎనిమిది, MIM ఒక స్థానంలో విజయం సాధించాయి. అందరూ ఊహించినట్లుగా MIM తన సిట్టింగ్ స్థానాన్ని మరోసారి కాపాడుకుంది.
  2.  నల్లగొండ, ఖమ్మం, భువనగిరి పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్‌ అఖండ మెజారిటీతో విజయం సాధించింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి నల్లగొండ స్థానం నుంచి ఐదు లక్షల 52 వేల ఓట్లతో ప్రత్యర్థిపై విజయం సాధించారు. ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో లభించిన అత్యధిక మెజార్టీ ఇది.
  3. అలాగే వరంగల్‌ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ఘన విజయం సాధించారు. మహబూబాబాద్‌ నుంచి బలరాం నాయక్‌, నాగర్ కర్నూలు నుంచి మల్లురవి, జహీరాబాద్‌ నుంచి షెట్కార్‌, పెద్దపల్లి స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.
  4. మహబూబ్‌నగర్‌ నుంచి డీకే అరుణ, నిజామాబాద్‌, కరీంనగర్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీలు అరవింద్‌, బండి సంజయ్‌ ఘన విజయం సాధించారు. మల్కాజ్‌గిరిలో ఈటల, సికింద్రాబాద్‌ నుంచి కిషన్‌రెడ్డి, చేవెళ్ల నుంచి కొండా, మెదక్ నుంచి రఘునందన్‌రావు, ఆదిలాబాద్‌ నుంచి నగేశ్‌ విజయం సాధించారు.
  5. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లాగే బీఆర్‌ఎస్‌కు మరోసారి షాకిచ్చారు ఓటర్లు. రాష్ట్రవ్యాప్తంగా 17 స్థానాల్లో పోటీ చేసిన బీఆర్‌ఎస్‌.. ఏ ఒక్క స్థానంలోనూ ప్రభావం చూపలేక చతికిల పడింది. ఒక్కసీటు కూడా రాకపోవడంతో నేతలు, కార్యకర్తలు నైరాశ్యంలో మునిగారు.
  6. తెలంగాణలో 14 స్థానాల్లో విజయం సాధిస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి అంచనాలు తప్పాయి. కాంగ్రెస్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితం అయ్యింది. బీజేపీ మాత్రం అనూహ్యంగా పుంజుకుంది. 2019 ఎన్నికల్లో 4 స్థానాలు గెలవగా ఈ సారి 8 సీట్లు సాధించింది.
  7. తెలంగాణలో కాంగ్రెస్‌ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. ఆ పార్టీ కార్యాలయాలు నేతలు, కార్యకర్తల సంబురాలతో మిన్నంటాయి. గాంధీభవన్‌లో సీనియర్ నేత వీ. హనుమంతరావు డోలు వాయిస్తూ సంబురాలు జరుపుకున్నారు. కార్యకర్తలు బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు.
  8. కాంగ్రెస్‌కు దీటుగా 8 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ సంబురాలు మిన్నాంటాయి. హైదరాబాద్‌ బీజేపీ కార్యాలయంలో టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. మల్కాజ్‌గిరిలో ఈటల రాజేందర్ గెలుపుపై కార్యకర్తలు డాన్సులతో హోరెత్తించారు.
  9. తెలంగాణలో జరిగిన లోక్‌‌సభ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటమి చెందారు. మాజీ మంత్రులు దానం నాగేందర్, పద్మారావు గౌడ్, నామా నాగేశ్వరరావు, జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి, బోయినపల్లి వినోద్ కుమార్, చల్లా వంశీచంద్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాలోత్ కవిత, బీబీ పాటిల్, కొప్పుల ఈశ్వర్, రంజిత్ రెడ్డి, కాసాని తదితులు ఓటమి చెందారు.