తెలంగాణలోని న్యాయ కాలేజీల్లో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం లాసెట్, పీజీ ఎల్‌సెట్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షల ఫలితాల విడుదలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ఫలితాలను జూన్ 15న సాయంత్రం 4.00 PM గంటలకు విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొపెసర్ లింబాద్రి వెల్లడించారు.
రాష్ట్రంలో దాదాపు 30కి పైగా లా కళాశాల్లో.. మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉస్మానియా యూనివర్సిటీ మే 25న పరీక్ష నిర్వహించింది. ఈ ప్రవేశ పరీక్షలకు 43,692 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 36,218మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు 25,747మంది పోటీ పడ్డారు. అయితే ఈ పరీక్ష ఫలితాలను ఈ లింక్ ద్వారా చూసుకోవచ్చు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.