KTR: తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్ రాజకీయాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ట్విట్టర్‌లో ఎప్పుడూ క్రీయాశీలకంగా ఉండే కేటీఆర్ నెటిజన్ల ప్రశ్నలకు స్పందిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో నెటిజన్లు చేసిన పోస్టులకు రియాక్ట్ అవుతుంటారు. ఈ క్రమంలోనే కేటీఆర్ తాజాగా ట్విట్టర్ వేదికగా ‘ఆస్క్ యువర్ కేటీఆర్’ అనే ట్యాగ్‌లైన్‌తో నెటిజన్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం చెప్పారు.
ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు కేటీఆర్ ముందు ఉంచిన సమస్యలపై స్పందించారు. అదే విధంగా ఒక నెటిజన్ కేటీఆర్‌ను ప్రశ్నిస్తూ.. ‘జాతీయ రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి.? మిమ్మల్నికేంద్ర ఐటీ శాఖ మంత్రిగా చూడాలని ఉంది. దేశ వ్యాప్తంగా ఐటీ ఇండస్ట్రీ అభివృది చూడాలని ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన మంత్రి.. ‘సొంత రాష్ట్రానికి సేవ చేస్తూ సంతోషంగా ఉన్నను’ అని సింపుల్‌గా నేషనల్ పాలిటిక్స్‌పై తనకు ఆసక్తి లేదని చెప్పకనే చెప్పేశాడు.
I am happy to be in Telangana serving my state https://t.co/mDSwBNZITQ
— KTR (@KTRTRS) January 13, 2022
ఇదిలా ఉంటే మరో నెటిజన్ తెలంగాణలో లాక్‌డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయా.? అని అడగగా.. కేటీఆర్ స్పందిస్తూ.. కరోనా కేసులు సంఖ్య, వైద్యశాఖ అధికారుల సలహాలను బట్టి లాక్‌డౌన్ నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు.
Also Read: Pushpa Song: దేశాలు దాటుతున్న పుష్ప క్రేజ్.. పుష్పరాజ్ శ్రీవల్లి స్టెప్పును అలాగే దించేశాడుగా…
Nagarjuna Akkineni : బంగార్రాజుకు కూడా సీక్వెల్ రానుందా..? క్లారిటీ ఇచ్చిన కింగ్ నాగార్జున
Anupama Parameswaran: లిప్‌లాక్ సీన్లపై అనుపమ రియాక్షన్.. ఫ్యాన్స్‌కు క్షమాపణ..