తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 12వ తేదీ (సోమవారం) నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇంటర్‌బోర్డు విడుదల చేసింది. ఇంటర్‌బోర్డు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని, హాల్‌టికెట్లలో ఏమైనా తప్పులు ఉంటే సంబంధిత జూనియర్ కాలేజీ ప్రిన్సిపాళ్లకు తెలియజేసి సరిచేయించుకోవాలని విద్యార్థులకు సూచించారు. కాగా ఏడాది సప్లిమెంటరీ పరీక్షలకు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్ధులు 2,70,583 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్ధులు 1,41,742 మంది హాజరుకానున్నారు. అంటే రెండింటికీ కలిపి 4,12,325 మంది హాజరవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9,33 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ జూన్ 8న ఓ ప్రకటనలో తెలిపారు.
ఎథిక్స్, ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ పేపర్లు జూన్ 21, 22 తేదీల్లో ఉంటాయి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.