AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS High Court: మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లపై జోక్యం చేసుకోలేం.. స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం

మద్యం దుకాణాల కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు సీజే జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది.

TS High Court: మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లపై జోక్యం చేసుకోలేం.. స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం
Telangana High Court
Balaraju Goud
|

Updated on: Nov 23, 2021 | 9:57 PM

Share

TS High Court on Liqour Shops: మద్యం దుకాణాల కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలంటూ తెలంగాణ రిపబ్లికన్‌ పార్టీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తెలంగాణలో మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు ధర్మాసనం. రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో లేదని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లకు చట్టబద్ధత లేకపోయినప్పటికీ .. కేవలం సానుభూతి, దయతో కల్పించిందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

ఇదిలావుంటే, మద్యం దుకాణాల కేటాయింపులో ప్రభుత్వం గౌడ్స్‌కు 15 శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం రిజర్వేషన్‌ కల్పించిందని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అయితే, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలు 15.45 శాతం, ఎస్టీలు 9.08 శాతం ఉన్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. జనాభా ప్రాతిపదికను పరిగణనలోకి తీసుకోకుండా రిజర్వేషన్లు ఖరారు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌కు విరుద్ధమో చెప్పాలని ధర్మాసనం ప్రశ్నించింది. మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లలో జోక్యం చేసుకోలేమని.. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు పేర్కొంది. మరిన్ని వివరాలు సమర్పించేందుకు కొంత సమయం ఇవ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోరగా.. విచారణ డిసెంబరు 20కి వాయిదా వేసింది.

Read Also…  Kerala Models Mishap case: మాజీ మిస్‌ కేరళ మృతి కేసులో మరో ట్విస్ట్.. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి సంచలనాలు!