Telanga Rains: రాష్ట్రంలో దంచికొడుతున్న వానలు.. పొంగిపొర్లుతున్న నదులు.. వందలాది గ్రామాలకు నిలిచిన రాకపోకలు

|

Jul 13, 2022 | 7:03 AM

గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రహదారులు నదులను తలపిస్తున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చింది.

Telanga Rains: రాష్ట్రంలో దంచికొడుతున్న వానలు.. పొంగిపొర్లుతున్న నదులు.. వందలాది గ్రామాలకు నిలిచిన రాకపోకలు
Telangana Rains
Follow us on

Telanga Rains Update: ఊరూ.. ఏరూ ఏకం అయ్యాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆగని భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పలు జిల్లాల్లో కుంభవృష్టి కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లి ఊళ్లను దిగ్బంధించాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు అల్లాడుతున్నారు. ఉమ్మడి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పలిమెల, మహాముత్తారం, మహదేవ్‌పూర్‌, కాటారం మండలాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.

అతిభారీ వర్షాలతో పలిమెల మండల వాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. పెద్దంపేట వాగు వంతెన వద్ద రహదారి ధ్వంసమై 13 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లాలో పలు గ్రామాలకు వాగుల వల్ల రాకపోకలు నిలిచిపోయాయి.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా ఆగకుండా కురుస్తున్న వానలతో వాగులు వంకలు ఉప్పొంగాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ రహదారిపైకి వరద నీరు రావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వాగులు పొంగడంతో పలు మండలాల్లో రాకపోకలు స్తంభించాయి. ఉట్నూర్‌ మండలం నాగపూర్‌ సమీపంలో ప్రధాన రహదారి వంతెనపై నీరు పారి ఆదిలాబాద్‌-మంచిర్యాల రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్‌ జిల్లాలో గడ్డెన్న ప్రాజెక్టు ప్రధాన కాల్వకు గండిపడింది. భద్రాచలం వద్ద గోదావరి నిండుకుండను తలపిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో అంతకంతకూ ఉధృతి పెరుగుతోంది. రామాలయ పరిసరాలు, అన్నదాన సత్రం, పడమర మెట్లు, పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు, వరదలు పోటెత్తడంతో జనం నానాయాతనలు పడ్డారు. గోదావరి మధ్యలో చిక్కుకున్న తొమ్మిదిమంది క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చారు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..