Rains: సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి.. భారీ వర్షాలతో తీవ్ర అంతరాయం..

Rains: గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా బొగ్గు సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పెద్దపల్లి జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల బొగ్గు ఉపరితల గనులు...

Rains: సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి.. భారీ వర్షాలతో తీవ్ర అంతరాయం..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 13, 2022 | 7:11 AM

Rains: గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా బొగ్గు సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పెద్దపల్లి జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల బొగ్గు ఉపరితల గనులు చెరువులను తలపిస్తున్నాయి. రామగుండం ఏరియా పరిధిలోని ఓపీసీ- 1, 2 ల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. ఓపీసీ టూ లోకి వెళ్లే దారి వరదనీటితో కట్ కావడంతో క్వారీలోకి వెళ్లే రోడ్డు మూసుకుపోయింది. దీంతో కార్మికులు గనుల్లోకి వెళ్లలేక పోతున్నారు. నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోజూ సుమారు యాభై వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం ఏర్పడుతోంది.

పెద్దపల్లి జిల్లా- రామగుండం సింగరేణి గనుల్లో మూడు రీజియన్లలో నాలుగు ఓపెన్ కాస్ట్ గనులున్నాయి. ఇక్కడ ప్రతిరోజూ మూడు షిఫ్టుల్లో 70 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోంది. అయితే వర్షాలతో రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షం నీటి కారణంగా.. భారీ యంత్రాలు కదల్లేని దుస్థితి ఏర్పడింది. దీంతో బొగ్గు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా రూ. 2 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. వర్షం తగ్గితేనే ఉత్పత్తి జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గనుల్లో ఇలాంటి సమస్యే తలెత్తుతోంది. ఇప్పటి వరకు కొత్తగూడెంలో 27 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మోటార్లతో నీటిని బయటకు తోడుతున్నా.. వర్షాలకు మళ్లీ నీళ్లు చేరుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. ఇల్లెందులో వర్షాలకు సింగరేణి ఏరియాలోని ఓపెన్‌కాస్ట్‌లో వరద నీరు చేరింది. దీంతో ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. ఇల్లెందు పదో గనిలో10వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. టేకులపల్లి కోయగూడెం ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. 40వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి వెలికితీసే పనులకు అంతరాయం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు