Diwali 2021: రేపు తెలంగాణాలో వాక్సిన్‌కు హాలిడే.. దీపాలు వెలిగిస్తున్న సమయంలో శానిటైజర్స్ ఉపయోగించవద్దని వినతి

|

Nov 03, 2021 | 2:11 PM

Diwali 2021: దీపావళి పండగను పురస్కరించుకొని తెలంగాణ లో రేపు (నవంబర్ 4వ తేదీన) వాక్సినేషన్ కు సెలవుని ప్రభుత్వం ప్రకటించింది . ఈ మేరకు దీపావళి..

Diwali 2021: రేపు తెలంగాణాలో వాక్సిన్‌కు హాలిడే.. దీపాలు వెలిగిస్తున్న సమయంలో శానిటైజర్స్ ఉపయోగించవద్దని వినతి
Telangana Vaccine
Follow us on

Diwali 2021: దీపావళి పండగను పురస్కరించుకొని తెలంగాణ లో రేపు (నవంబర్ 4వ తేదీన) వాక్సినేషన్ కు సెలవుని ప్రభుత్వం ప్రకటించింది . ఈ మేరకు దీపావళి పండగ సందర్భంగా నవంబర్ 4వ తేదీన వాక్సినేషన్ కార్యక్రమానికి విరామం ఇచ్చారు. దీనితో గురువారంనాడు కోవిడ్ వాక్సినేషన్ ఇస్తున్న వైద్య సిబ్బంది విరామం దొరికింది.  అయితే ఎల్లుండి (నవంబర్ 5) శుక్రవారం నుంచి మళ్ళీ యధావిధిగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుముఖం పట్టింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది.  అయితే  ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఇక థర్డ్ వేవ్ ముంపు రానున్నదనే హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ టీకా ఇచ్చే దిశగా చర్యలు వేగవంతం చేసింది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ విషయంలో ప్రజలను చైతన్య పరిచేలా ప్రభుతం పలు చర్యలు చేపట్టింది. ఇప్పటికే మొబైల్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా చేస్తున్న సర్కార్.. ఇక ఇంటింటికి వ్యాక్సిన్ ను ఇస్తున్న సంగతి తేలిందే.

ప్రస్తుతం కరోనా నివారణ కోసం శానిటైజర్ లేని ఇల్లు లేదని చెప్పవచ్చు, అయితే దీపావళి పండగ సందర్భంగా దీపాలను, బాణాసంచా వెలిగించే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చేతులకు శానిటైజర్లను ఉపయోగించవద్దని సూచించారు. శానిటైజర్లలోని ఆల్కహాల్ కు మండే గుణం ఉంటుంది కనుక దీపావళిరోజున దీపాలు వేగిస్తున్న సమయంలో క్రాకర్స్ కలుస్తున్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని .. ప్రజలకు సూచించారు.

Also Read: Diwali Special Recipe: దీపావళి స్పెషల్ షుగర్ ఫ్రీ ఆల్మండ్ బర్ఫీ తయారు చేసుకొనే విధానం ఎలా అంటే..