Telangana: టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్.. టాలీవుడ్‌పై హైకోర్టు టైమ్‌ బాంబ్

తెలంగాణలో టికెట్ రేట్ల మీద చర్చ రియల్ సినిమాలను మించిపోతుంది.. హార్రర్ సినిమాల్లో ఉండే ట్విస్టులు, టర్నుల కంటే ఎక్కువగా ఇక్కడే ఉన్నాయి. ఒక్కోరోజు ఒక్కో ట్విస్టు.. ఇటు సర్కార్ వైపు నుంచి.. అటు కోర్టు వైపు నుంచి.. రెండు వైపులా ఇండస్ట్రీపై నాన్ స్టాప్ పిడుగులు పడుతూనే ఉన్నాయి. తాజాగా ఈ రేట్లపై మరో టైమ్ బాంబు పేల్చింది కోర్ట్.

Telangana: టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్.. టాలీవుడ్‌పై హైకోర్టు టైమ్‌ బాంబ్
Telangana High Court

Updated on: Jan 21, 2026 | 8:03 AM

ఇకపై తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంచుకోవాలంటే విడుదలకు 90 రోజులు ముందు పిటిషన్ దాఖలు చేసుకోవాల్సిందే అని హై కోర్ట్ తీర్మానించింది. రీసెంట్‌గా అఖండ 2, రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ లాంటి పెద్ద సినిమాల రేట్ల విషయంలో సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై కోర్టు సీరియస్ అయింది.. అందుకే ఇలాంటి తీర్పు బయటికొచ్చింది. 90 రోజుల ముందే పిటిషిన్ వేసుకోవడం అనేది అసలు సాధ్యమేనా..? కోర్ట్ తీర్పు సంగతి కాసేపు అలా ఉంచితే.. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీలో ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చెప్పడం కష్టం.

ఇది చదవండి: ‘ఆ సాంగ్ వల్లే హీరోయిన్‌గా సినిమాలు మానేశా.!’

అవి అప్పుడున్న OTT ఖాళీలు.. థియేటర్స్ సర్దుబాటును బట్టి పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ఆధారపడి ఉంటాయి. అలాంటిదిప్పుడు మూన్నెళ్ల ముందే పిటిషన్ అనేది పెద్ద సమస్యే. మల్టీప్లెక్స్ రేట్లు రూ. 200 నుంచి రూ. 295 వరకు పెంచుకునే వెసలుబాటు ప్రభుత్వమే ఇచ్చింది.. అవి కాకుండా ఇంకా రేట్లు అడుగుతున్నారు నిర్మాతలు. అయితే ఈ రేట్ల పెంపుకు కఠిన నిబంధనలు పెట్టి.. రెమ్యూనరేషన్ లేకుండా ప్రొడక్షన్ కాస్ట్ 400 కోట్లు దాటిన సినిమాలకే వారం రోజుల పాటు పెంచుకునే అవకాశం ఉండేలా సర్కార్ ఆలోచిస్తే బెటర్ అనేది ఓ వర్గం వాదన.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఏడాది పొడవునా డబ్బే డబ్బు.! ఎవర్‌గ్రీన్ బిజినెస్‌లు.. ఇప్పుడు వీటికే డిమాండ్

కోర్ట్ తీర్పు కానీ అమలైతే.. ముందుగా నష్టపోయేది సమ్మర్ సినిమాలే. ఎందుకంటే 90 రోజులు ముందు అంటే ఇప్పుడే పిటిషన్ వేసుకోవాలి. అందులో విశ్వంభర, ఉస్తాద్ లాంటి భారీ సినిమాలకు ఇంకా డేట్సే లాక్ కాలేదు. అలాగే రాబోయే భారీ సినిమాలకు నష్టం తప్పకపోవచ్చు. మరి దీనిపై పై కోర్టుకు వెళ్తారా లేదంటే ప్రభుత్వం ఏదైనా ప్రత్యేక చట్టం తెస్తుందా అనేది చూడాలి.

ఇది చదవండి: పరిటాల రవిని చంపిన మొద్దు శీను అవ్వాలనుకున్నది ఇదే.. కానీ చివరికి.!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..