AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC Group 1 Result: గ్రూప్‌-1పై తెలంగాణలో రాజకీయ దుమారం.. ఆరోపణలపై టీజీపీఎస్సీ ఫుల్ క్లారిటీ..

గ్రూప్‌-1పై తెలంగాణలో రాజకీయ దుమారం నడుస్తోంది. హాల్‌ టికెట్ల దగ్గర్నుంచి... పేపర్‌ కరెక్షన్‌ వరకూ ప్రతిదాంట్లోనూ పెద్ద స్కామ్‌ జరిగిందంటూ TGPSCపై పలువురు రాజకీయ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో రంగంలోకి దిగిన TGPSC... విమర్శలకు చెక్‌పెట్టేలా ప్రకటన విడుదల చేసింది. పలువురు నేతలు ప్రస్తావించిన ప్రతి పాయింట్‌కు క్లారిటీ ఇచ్చింది.

TGPSC Group 1 Result: గ్రూప్‌-1పై తెలంగాణలో రాజకీయ దుమారం.. ఆరోపణలపై టీజీపీఎస్సీ ఫుల్ క్లారిటీ..
Telangana Group-1 Exam
Shaik Madar Saheb
|

Updated on: Apr 16, 2025 | 8:26 AM

Share

తెలంగాణలో గతకొన్ని రోజులుగా టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1పై రాజకీయ రచ్చ నడుస్తోంది. గ్రూప్‌-1 పరీక్షపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రూప్‌1 నియామకాల్లో కోట్ల రూపాయల స్కామ్‌ జరిగిందన్నారు. పరీక్ష రాయని 10 మందికి ఫలితాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. పరీక్షను వెంటనే రద్దు చేసి సీబీఐ విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశారు కౌశిక్‌రెడ్డి. ఇలా కౌశిక్‌రెడ్డితో పాటు మరికొందరు విపక్ష నేతలు సైతం గ్రూప్1పై విమర్శలు గుప్పించిన నేపథ్యంలో రంగంలోకి దిగిన టీజీపీఎస్సీ… గతకొన్ని రోజులుగా వస్తున్న ఆరోపణలను ఖండించింది.

దురుద్దేశంతోనే విమర్శలు..

కొందరు దురుద్దేశంతోనే గ్రూపు-1 పరీక్ష పై అసత్య ప్రచారం చేస్తున్నారని టీజీపీఎస్సీ మండిపడింది. ఆ దురుద్దేశం వెనుక ప్రయివేట్ కోచింగ్ సెంటర్లు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేసింది. ప్రొటోకాల్ ప్రకారమే నిపుణులతో వాల్యుయేషన్ చేయించినట్లు తెలిపింది. లిమిటెడ్ మార్కుల పరీక్షలో ఒకే తరహా మార్కులు రావడం సహజమని వెల్లడించింది. అంతమాత్రాన అక్రమాలు జరిగాయని అభ్యర్థులను, తెలంగాణ సమాజాన్ని తప్పబట్టడం సరికాదని హితవు పలికింది టీజీపీఎస్సీ.

గ్రూప్‌1 ఆరోపణలపై ఇటు టీజీపీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్‌ స్పందించారు. TGPSCపై నిరాధార ఆరోపణలు సరికాదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆధారాలుంటే నిరూపించాలంటూ సవాల్ చేవారు.

మొత్తంగా… గ్రూప్1 పరీక్షలపై వస్తున్న అసత్యాలను నమ్మోద్దంటోంది టీజీపీఎస్పీ. అంతా ప్రోటోకాల్‌ ప్రకారమే జరిగిందని చెబుతోంది. మరీ టీజీపీఎస్సీ ప్రకటనపై పొలిటికల్ రియాక్షన్స్‌ ఎలా ఉండబోతోతున్నాయో చూడాలి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..