Job Mela: నిరుద్యోగులకు అలర్ట్! తెలంగాణలోని అన్నీ జిల్లాల్లో జాబ్ మేళా.. ఈ తేదీల్లోనే..
తెలంగాణ రాష్ట్ర ట్రైనింగ్ అండ్ ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో త్వరలో అన్ని జిల్లా కేంద్రాల్లో జాబ్ మేల నిర్వహించబోతున్నట్లు రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి సవ్యసాచి ఘోష్ తెలిపారు..
Mega job mela in Telangana: తెలంగాణ రాష్ట్ర ట్రైనింగ్ అండ్ ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో త్వరలో అన్ని జిల్లా కేంద్రాల్లో జాబ్ మేల నిర్వహించబోతున్నట్లు రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి సవ్యసాచి ఘోష్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ, తెలంగాణ రాష్ట్ర ట్రైనింగ్ అండ్ ఉపాధి సంస్థ (Department of Employment and Training), సెట్విన్ సంయుక్తంగా ఈ రోజు (ఫిబ్రవరి 26) యూత్ హాస్టల్ ఆవరణలో నిర్వహించిన జాబ్ మేళా (job mela)ను యూత్ సర్వీసెస్ శాఖ డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి సవ్యసాచి ఘోష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సవ్యసాచి ఘోష్ మాట్లాడుతూ.. ప్రస్తుతం నిర్వహించిన జాబ్ మేళలో దాదాపు 60 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. దాదాపు 8 వేల మంది నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారని ఆయన తెలిపారు. కాగా మార్చి 5న మహబూబ్ నగర్ జిల్లాలో, 6వ తేదీన ఖమ్మం జిల్లాలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇలా వరుసగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మార్చి నెల్లో జాబ్ మేళా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగ పరచుకోవాలని ఆయన అన్నారు.
Also Read: