తెలంగాటణ రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి ఈ పాస్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవల్సిందిగా ఎస్సీ సంక్షేమ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు. బోధన ఫీజులు, ఉపకారవేతనాల కోసం దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్ధులకు మరో అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు. తాజా ప్రకటన ద్వారా ఫ్రెషర్లు, రెన్యువల్ చేసుకోవచ్చన్నారు
ఆన్‌లైన్ విధానంలో జూన్ 1 నుంచి 15 వరకు ఈ-పాస్ వెబ్‌సైట్లో దరఖాస్తులు అందుబాటులో తెలిపారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులు ఈ-పాస్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన విద్యార్థులందరూ ఈ అవకాశం సద్వినియోగపరచ్చుకోవాలని తెలిపారు.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.