Lockdown in Telangana: తెలంగాణలో లాక్‌డౌన్ ఉంటుందా?.. ప్రభుత్వం ముందున్న ఆప్షన్లు ఇవేనా?..

Lock Down in Telangana: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతీ రోజూ నమోదయ్యే పాజిటీవ్ కేసులు మూడు వేలకు పైగానే నమోదవుతున్నాయి.

Lockdown in Telangana: తెలంగాణలో లాక్‌డౌన్ ఉంటుందా?.. ప్రభుత్వం ముందున్న ఆప్షన్లు ఇవేనా?..
Cm Kcr
Follow us
Shiva Prajapati

|

Updated on: May 30, 2021 | 4:57 PM

Lockdown in Telangana: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతీ రోజూ నమోదయ్యే పాజిటీవ్ కేసులు మూడు వేలకు పైగానే నమోదవుతున్నాయి. అదే సమయంలో కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య కూడా గణనీయంగానే పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుతుందని, మరో వారంలో దీని ప్రభావం మరింత తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ నేటితో ముగియనుండటం.. మళ్లీ లాక్‌డౌన్‌ను కొనసాగిస్తారా? లేక అన్‌లాక్ చేస్తారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ లాక్‌డౌన్ అంశంపై ఇవాళ ప్రగతి భవన్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, ప్రభుత్వం లాక్‌డౌన్‌ను కొనసాగిస్తుందా? లేక అన్ లాక్ చేస్తుందా? లాక్‌డౌన్ కొనసాగిస్తునే సడలింపులు ఇస్తుందా? ప్రభుత్వం ఏ ప్రకటన విడుదల చేస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. అయితే, లాక్‌డౌన్ విషయంలో ప్రభుత్వం ముందు కొన్ని ఆప్షన్లు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఆ ఆప్షన్లేంటో ఇప్పుడు చూద్దాం.

1. ఇప్పుడు ఉన్నట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కొనసాగించడం. 2. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు మరికొన్నింటికి సడలింపులు ఇవ్వడం. 3. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లాక్‌డౌన్ విధించి పలు సడలింపు ఇవ్వడం. 4. వీకెండ్స్‌లో సంపూర్ణ లాక్‌డౌన్ విధించడం. 5. ఇంతకు ముందు మాదిరిగా పగటి పూట పూర్తిగా సడలింపులు ఇచ్చి కేవలం నైట్ కర్ఫ్యూ విధించడం. 6. కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ విధించి.. మిగతా ప్రాంతాలకు మినహాయింపులు ఇవ్వడం. 7. ఇవేవీ కాకుండా ప్రస్తుతం లాక్‌డౌన్ పొడిగిస్తే వారం రోజు పొడిగించాలా? పది రోజులా? అనే అంశాలు సర్కార్ ముందు ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా ఈ అంశాలపేనే సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Also read:

నైరుతి రుతుపవనాలు మరో మూడు రోజులు ఆలస్యం.. తెలంగాణలో మాత్రం తేలికపాటి వర్షాలు..

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్