AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం.. రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం!

హైదరాబాద్‌ సరూర్‌నగర్ అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో గుట్టుచప్పుడు కాకుండా 55 లక్షలు రూపాయలు కాజేసేందుకు ప్రయత్నించారు కొందరు కేటుగాళ్లు. ఈ సంఘటనతో అప్రమత్తమైన రాష్ట్ర వైద్య శాఖ అధికారుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో సీఐడీ ఎంక్వైరీకి ఆదేశించింది రేవంత్ సర్కార్.

Hyderabad: కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం.. రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం!
Kidney Rocket
Balaraju Goud
|

Updated on: Jan 24, 2025 | 5:40 PM

Share

హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. కిడ్నీ రాకెట్‌ ముఠాల డొంక కదిలించేందుకు సిద్ధమైంది. తెలంగాణలో కొన్నేళ్లుగా జరిగిన అన్ని కిడ్నీ ఆపరేషన్లపై సీఐడీ విచారణకు ఆదేశించడం ఆసక్తి రేపుతోంది.

హైదరాబాద్‌ మహానగరంలోని సరూర్‌నగర్ అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో అనుమతి లేకుండా కిడ్పీ మార్పిడులు చేయడంతోపాటు.. గుట్టుచప్పుడు కాకుండా 55 లక్షలు రూపాయలు కాజేసేందుకు కొందరు కేటుగాళ్లు ప్రయత్నించడం సంచలనం సృష్టించింది. అయితే.. వైద్యశాఖ అధికారులకు సమాచారం అందడంతో గుట్టురట్టు అయింది. అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడి జరిగినట్లు గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు.

దాంతో.. అలకనంద ఆస్పత్రి యాజమాని సుమంత్ సహా 8మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించి కీలక విషయాలు రాబట్టారు. ఈ క్రమంలోనే.. అలకనంద ఆస్పత్రి ఎండీ సుమంత్‌, రిసెప్షనిస్ట్‌ గోపిని కోర్టులో హాజరుపర్చడంతో రిమాండ్‌ విధించారు న్యాయమూర్తి. పోలీసుల అదుపులో ఉన్న మరో ఆరుగురిని విచారిస్తున్నారు. కిడ్నీ డోనర్లు, గ్రహీతలకు సర్జరీ ఎక్కడ చేశారు? ఈ దందాలో ఇంకా ఎంతమంది ఉన్నారనే దానిపై పోలీసులు కూపీ తీస్తున్నారు. సర్జరీ చేసిన డాక్టర్ల కోసం ఆరు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

ఇక.. కిడ్నీ రాకెట్ ఘటనలో తెలంగాణ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక వైద్యుల కమిటీ విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చెన్నైకి చెందిన పూర్ణిమ మధ్యవర్తిగా ఉన్నట్టు కమిటీ విచారణలో తేలింది. దీనికి సంబంధించి హెల్త్ సెక్రటరీకి ప్రత్యేక వైద్యుల కమిటీ నివేదిక కూడా అందించింది. కిడ్నీ డోనర్లు, కిడ్నీ తీసుకున్నవారి వివరాలు సేకరించి.. వారికి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తేల్చారు. అటు.. అలకనంద ఆస్పత్రిని వైద్యాధికారులు సీజ్‌ చేశారు. మరోవైపు.. తెలంగాణలో కొన్నేళ్లుగా జరిగిన కిడ్నీ మార్పిడుల డొంక కదిలించేందుకు రేవంత్‌రెడ్డి సర్కార్‌ రెడీ అవుతోంది. అలకనంద ఆస్పత్రి ఘటనతో అలెర్ట్‌ అయిన ప్రభుత్వం.. ఇప్పటివరకు ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగిన కిడ్నీ మార్పిడి ఆపరేషన్లపై దర్యాప్తు చేయాలని ఆదేశించడం హాట్‌టాపిక్‌గా మారుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..