AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: చుట్టూ ఇంజనీరింగ్ కాలేజీలు, విద్యార్థుల హాస్టల్స్.. మధ్యలో ఇదేం పని..!

ఎన్ని వార్నింగ్‌లు ఇచ్చినా.. ఎన్నిసార్లు కౌన్సిలింగ్‌ చేసినా మత్తు బ్యాచ్‌ మాత్రం తగ్గేదేలే అంటోంది. మీరు ఏదైనా చేసుకోండి.. మా పని మాదే అంటూ చెలరేగిపోతున్నారు. అయితే, మత్తు బ్యాచ్‌ ఎత్తుల్ని చిత్తుచేస్తూ డ్రగ్స్‌, గంజాయి ముఠాలకు చెక్‌ పెడుతున్నారు తెలంగాణ పోలీసులు. తాజాగా ఇళ్ల మధ్య గంజాయి సాగు చేస్తున్న కంత్రీగాళ్ల ఆటకట్టించారు ఎక్సైజ్‌ పోలీసులు.

Hyderabad: చుట్టూ ఇంజనీరింగ్ కాలేజీలు, విద్యార్థుల హాస్టల్స్.. మధ్యలో ఇదేం పని..!
Cannabis Plants
Balaraju Goud
|

Updated on: Jan 24, 2025 | 4:49 PM

Share

డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా తెలంగాణ. ఇదీ రాష్ట్ర ప్రభుత్వ టార్గెట్. ఈ క్రమంలో అనేక చర్యలు చేపట్టినా.. చాప కింద నీరులా గంజాయి సరఫరా అవుతున్నాయి. ఏకంగా ఇళ్ల మధ్యనే గంజాయి మొక్కలను పెంచుతూ పట్టుబడింది ఓ కుటుంబం. ఈ ఘటన హైదరాబాద్ శివారు ప్రాంతంలో వెలుగు చూడటంతో తీవ్ర కలకలం రేపుతోంది.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మొక్కలు పెంచుతున్నారన్న సమాచారంతో పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది సంయుక్తంగా దాడులు చేశారు. ఆ ప్రాంతంలో అనేక హాస్టల్స్ ఉన్నా.. వాటన్నింటి మధ్య గుట్టు చప్పుడు కాకుండా గంజాయి మొక్కలను పెంచుతున్నారు. ఈ మొక్కల పెంపకం. ఇటీవల ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ప్రాంతానికి 30 మీటర్ల దూరంలోనే ఈ గంజాయి మొక్కలను పెంచుతుండటం పోలీసులను షాక్‌కు గురి చేసింది.

మంగళ్‌పల్లి గేటు, నాగార్జున సాగర్ రహదారికి అనుకొని ఉన్న రేకుల షెడ్‌లో ఈ మొక్కల పెంపకం సాగుతోంది. ఈ గంజాయిని ఎవరు పెంచుతున్నారనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. చుట్టూ ఇంజనీరింగ్ కాలేజీలు, హాస్టల్స్‌ మధ్య గంజాయి మొక్కలు దర్శనం ఇవ్వడం చూసి పోలీసులే షాక్‌కు గురయ్యారు. బీహార్‌ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం ఈ రేకుల షెడ్డులో నివాసం ఉంటోంది. ఆ షెడ్డు పరిసరాల్లో ఈ గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వీడియో చూడండి.. 

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..
గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! బరువు తగ్గి
గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! బరువు తగ్గి
పచ్చదనం కోసం రైలు ప్రయాణికుడి వినూత్న ప్రయోగం!
పచ్చదనం కోసం రైలు ప్రయాణికుడి వినూత్న ప్రయోగం!
అంత పెద్ద హీరోయిన్.. ఆ ఒక్క పనితో నన్ను పట్టుకొని ఏడ్చేసింది..
అంత పెద్ద హీరోయిన్.. ఆ ఒక్క పనితో నన్ను పట్టుకొని ఏడ్చేసింది..
భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?
భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?
బస్సును ఢీకొట్టిన బండరాయి భయానక దృశ్యం..!
బస్సును ఢీకొట్టిన బండరాయి భయానక దృశ్యం..!
ఖరీదైన ఫేస్ వాష్‌లకు గుడ్‌బై చెప్పేయండి.. మెరిసే చర్మానికి ఇలాంటి
ఖరీదైన ఫేస్ వాష్‌లకు గుడ్‌బై చెప్పేయండి.. మెరిసే చర్మానికి ఇలాంటి
పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నిరుపేదల కోసం సెస్‌ పెంపు..
పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నిరుపేదల కోసం సెస్‌ పెంపు..
నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు..
నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు..