ఓరి దేవుడా! కుప్పకూలిన అంగన్వాడి సెంటర్ పైకప్పు.. ఐదుగురు చిన్నారులకు గాయాలు
కొన్ని ప్రభుత్వ బడుల్లో పరిస్థితులు ఎంతదారుణంగా ఉన్నాయో చెప్పేందుకు ఇప్పుడు చెప్పబోయే ఘటనే ఓ బెస్ట్ ఎగ్జాంపుల్..! అయితే.. అదృష్టవశాత్తూ పిల్లలకు ప్రాణాపాయం తప్పింది. అంగన్‌వాడీ స్కూల్‌లో పైకప్పు ఊడిపడిన ఘటనలో కొందరు పిల్లలు గాయపడ్డారు. సంగారెడ్డి జిల్లా వెంకటపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో జరిగింది ఈ ఘటన. వెంటనే వాళ్లందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వారంతా చిన్న పిల్లలు, అంగన్వాడి బడిలోకి వచ్చి గంట అయ్యింది. అఆఇఈలు మొదలు పెట్టగానే హఠాత్తుగా స్లాబ్ పెచ్చులు ఊడి కింద పడడంతో అంతా ఉలిక్కిపడ్డారు. అందులో ఉన్న ఐదుగురు చిన్నారులకు గాయాలు అయ్యాయి. అసలు అక్కడ ఏమి జరిగిందో అర్ధం కాక చిన్నారులు అర్తనాదలు మిన్నంటాయి. అంగన్వాడీ పాఠశాల ప్రారంభం అయిన గంటలోపే పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడిపోవడంతో ఆందోళనకు గురయ్యారు. వెంటనే తేరుకున్న అంగన్వాడీ సిబ్బంది స్థానికుల సహయంతో గాయపడ్డ విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
నారాయణఖేడ్ మండలం వెంకటాపుర్ గ్రామంలో అంగన్వాడి పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి ఐదు మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. అకస్మాత్తుగా పాఠశాల పైకప్పు ఊడిపడడంతో మౌనిక, హారిక, రిషిక, అంకిత, ఆవినాష్ అనే విద్యార్థుల తలకు, చేతులకు, కాళ్లకు గాయలయ్యాయి. .దీంతో హుటాహుటిన స్థానికులు స్పందించి విద్యార్థులను నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్‌కు తరలించి, చికిత్స అందిస్తున్నారు. మొత్తం అంగన్వాడి పాఠశాలలో 15 మంది విద్యార్థులు ఉండగా.. అందులో ఐదుగురికి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆసుపత్రి వద్దకు చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి పరామర్శించి, వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. చిన్నారులందరికీ మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు ఎమ్మెల్యే. అయితే పిల్లకు చిన్న, చిన్న గాయాలు కావడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు ఉన్న అంగన్వాడి కేంద్రం శిథిలావస్థకు చేరిందని, వెంటనే కొత్త భవనాల్లో అంగన్వాడి సెంటర్లు తేరవాలని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..