Telangana: మందుబాబులూ అలర్ట్‌.. ఈ రెండు రోజులు వైన్స్‌ షాప్స్‌ బంద్‌..

వైన్స్‌తో పాటు బార్లు, కల్లు కాంపౌండ్స్‌ కూడా మూసి వేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలకు విరుద్దంగా మద్యాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల ఫలితాల తేదీన కూడా మద్యం దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు...

Telangana: మందుబాబులూ అలర్ట్‌.. ఈ రెండు రోజులు వైన్స్‌ షాప్స్‌ బంద్‌..
Wines Bundh
Follow us

|

Updated on: May 09, 2024 | 2:53 PM

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను బంద్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా పండుగలు, జాతరల్లో సమయంలో మద్యం దుకాణాలు అది కూడా హైదరాబాద్‌లో మాత్రమే వైన్స్‌ బంద్‌ చేస్తారు. మరి ఇప్పుడెందుకు వైన్స్‌ బంద్‌ కానున్నాయి. అది కూడా రాష్ట్రమంతా అనే సందేహంలో ఉన్నారు కదూ! సారి ఓట్ల పండగ నేపథ్యంలో వైన్స్‌ మూతపడనున్నాయి.

అవును తెలంగాణలో మే 13వ తేదీన లోక్‌ సభా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసి వేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల జరగాలనే ఉద్దేశంతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని ముందస్తు చర్యలో భాగంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మే 11న శనివారం సాయంత్రం 6 గంటల నుంచి మే 13న సోమవారం సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలను మూసివేయాలని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

వైన్స్‌తో పాటు బార్లు, కల్లు కాంపౌండ్స్‌ కూడా మూసి వేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలకు విరుద్దంగా మద్యాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల ఫలితాల తేదీన కూడా మద్యం దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జూన్‌ 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా బార్లు, వైన్స్‌లు, మద్యం దుకాణాలను మూసివేయాలని తెలిపారు. ఇదిలా ఉంటే ఎన్నికల ఫలితాల రోజున శంషాబాద్ లో డ్యూటీ ఫ్రీ షాప్స్ మాత్రం తెరిచే ఉంటాయి.

ఇదిలా ఉంటే శనివారం సాయంత్రానికి ఎన్నికల ప్రచారం ముగుస్తున్న విషయం తెలిసిందే. సరిగ్గా ఎన్నికల ప్రచారం ముగియగానే మద్యం దుకాణాలు బంద్‌ కానున్నాయి. ఈ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గస్తీ కాస్తుంటారు. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాలు ఓపెన్‌ ఉంటే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే వైన్స్‌ను మూసి వేయనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..