Krishna River Management Board: కృష్ణాబోర్డుకు తెలంగాణ సర్కారు తాజాగా లేఖ రాసింది. నీటి తరలింపులు, విద్యుత్ ఉత్పత్తిపై కీలక ప్రతిపాదనలు చేసింది. పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపుకు త్రిసభ్య కమిటీ ఆమోదం లేకుండా అనుమతించకూడదని తెలంగాణ తన లేఖలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జల విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి తెలంగాణకు అభ్యంతరం లేదని పేర్కొంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ చేసిన 811 tmc లు గంపగుత్త కేటాయింపులని తెలిపిన తెలంగాణ.. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ధృవీకరించిందని పేర్కొంది. రెండు రాష్ట్రాల మధ్య పున: కేటాయింపుల అంశం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ జరుపుతున్నందున 2021-22 వాటర్ ఇయర్ నుంచి 50:50 నిష్పత్తిలో నీటి పంపకాలు జరపాలని తెలంగాణ తన లేఖలో స్పష్టం చేసింది.
బేసిన్‌లో ఉండే ప్రాంతాల అవసరాలు తీరిన తర్వాతనే బేసిన్ ఆవల ప్రాంతాలకు నీటిని తరలించడానికి అనుమతించాలని KRMBని తెలంగాణ కోరింది. కృష్ణాలో వరద ఉధృతి ఉన్న కారణంగా అన్ని జల విద్యుత్ కేంద్రాల నుంచి జల విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో చేయడానికి అనుమతించాలని KRMB ని తన లేఖలో తెలంగాణ కోరింది.
Read also : Bharti Arora: మహిళా సీనియర్ ఐపీఎస్ సంచలన నిర్ణయం.. ఇక తన జీవితం శ్రీకృష్ణుడి సేవకు అంకితమంటూ..