Telangana: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెండో పీఆర్సీ, మధ్యంతర భృతి ప్రకటనకు ఛాన్స్
Second PRC:దీంతోపాటు మధ్యంతర భృతిని కూడా ప్రకటించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ స్కీం ఈహెచ్‌ఎస్‌పైనా కూడా నిర్ణయం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
హైదరాబాద్, జూలై 21: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పేందుకు రెడీ అవుతోంది తెలంగాణ ప్రభుత్వం. వారి జీతభత్యాల అధ్యయనం కోసం 2వ పీఆర్సీ ప్రకటించే అవకాశం ఉంది. దీంతోపాటు మధ్యంతర భృతిని కూడా ప్రకటించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ స్కీం ఈహెచ్‌ఎస్‌పైనా కూడా నిర్ణయం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈహెచ్‌ఎస్‌ను అమలు చేసేందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించనుంది. ఉద్యోగుల హౌసింగ్‌పై కూడా ప్రకటన వస్తుందనే చర్చ జరుగుతోంది.
మరో పది రోజుల్లో అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు(కేసీఆర్) నేరుగా ప్రగతి భవన్‌లో సమావేశం కానున్నారని.. వారితోనే వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారని సీఎంఓ వర్గాలు అంటున్నాయి. వీటితోపాటు చాలా అంశాలు ఇందులో ఉంటాయని.. వాటి విధి విధానాలపై కూడా నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.
ఇందు కోసం ఇప్పటికే ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అన్ని అనుకూలిస్తే మరో పది రోజుల్లో ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు. సమాశం తేదీలను తర్వలోనే ప్రకటిస్తారని అనుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం