
విద్యుత్ శాఖలో నియామకాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ శాఖలో కారుణ్య నియామకాలను రద్దు చేస్తూ గత BRS ప్రభుత్వం ఏప్రిల్ 29, 2020న ఉత్తర్వులు వెలువరించింది. తాజాగా ఆ ఉత్తర్వులను కాంగ్రెస్ సర్కార్ ఉపసహంరించుకుంది. దీంతో ఈ శాఖలో కారుణ్య నియామకాలు కొనసాగనున్నాయి. ఇందుకు సంబంధించిన యూనిఫాం పాలసీపై ఫోకస్ పెట్టాలని ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ పరిధిలోని అన్ని కార్యాలయాలకు CMD ఆదేశాలు జారీ చేశారు. గతంలో కారుణ్య నియామకం కోసం అర్జీ పెట్టుకున్నవారికి.. మరో విడుత అప్లికేషన్ ఫార్మాట్‌ను రెడీ చేయాలని సూచించారు. మరోసారి దరఖాస్తు పెట్టుకునేందుకు వారికి చాన్స్ ఇవ్వనున్నారు.
చనిపోయిన విద్యుత్ ఉద్యోగల జీవిత భాగస్వాములు/పిల్లలకి మాత్రమే కాకుండా విధి నిర్వహణకు శారీరకంగా స్థోమత లేని ఎంప్లాయిస్ విషయంలోనూ కారుణ్య నియామకాలు చేపట్టాలని CMD జారీ చేసిన ఉత్తర్వల్లో పేర్కొన్నారు. దీంతో ఆయా కుటుంబాలకు భారీ ఊరట దక్కనుంది.
కారుణ్యం నియామకం అంటే…?
పురపాలికలు, పంచాయతీ రాజ్, స్థానిక సంస్థల్లో లేదా ఏదేని గవర్నమెంట్ శాఖల్లో పనిచేస్తూ చనిపోయిన, లేదా ఏదైనా కారణంతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగి భాగస్వామి లేదా పిల్లల్లో ఒకరికి జాబ్ కల్పించడమే కారుణ్య నియామకం. ఉద్యోగి మృతితో మానసిక కుంగుబాటుతో పాటు జీతం రాక వారి ఫ్యామిలీలు ఆర్థిక ఇక్కట్లు పడుతున్నాయి. అందుకే వారి కోసం మానవతా దృక్ఫథంలో ఆలోచించి కారణ్య నియామకాలు చేపడుతూ ఉంటారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..