Advocates Murder case: న్యాయవాద దంపతుల హత్య ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనలో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలిపెట్టవద్దంటూ ప్రభుత్వం పోలీసులకు ఆదేశించింది. న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి దారుణ హత్య ఘటనను హోం మంత్రి మహమూద్ అలీ ఖండించారు. ఈ ఘటనపై హోంమంత్రి డీజీపీ మహేందర్‌రెడ్డితో మాట్లాడారు. నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. హత్య హేయమైన చర్యని.. హత్యకు పాల్పడిన వారిని పోలీసులు గుర్తించినట్లు మహమూద్ అలీ వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. దీంతోపాటు పకడ్బందీగా దర్యాప్తు చేయాలని డీజీపీతో పాటు నార్త్‌జోన్ ఐజీ, రామగుండం సీపీ సత్యనారాయణను ఆదేశించారు.
హైకోర్టు లాయర్లు గట్టు వామనరావు, గట్టు నాగమణి మంథని నుంచి హైదరాబాద్ వైపు కారులో వెళ్తుండగా.. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద దుండగులు కత్తులతో దాడి చేసి హత్యచేశారు. ఈ ఘటనలో పోలీసులు ముగ్గురు వ్యక్తులు.. కుంటా శ్రీనివాస్ సహా అతని ఇద్దరు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. మరి కొందరి ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నారు. దీంతోపాటు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: