Gandhi Hospital: గాంధీ ఆస్పత్రి అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన సర్కార్.. భారీగా నిధుల కేటాయింపు..

|

Oct 31, 2022 | 11:03 PM

కార్పొరేట్‌ హాస్పిటల్స్‌కి ఏమాత్రం తీసిపోకుండా గవర్నమెంట్‌ ఆస్పత్రులను తీర్చిదిద్దుతోంది తెలంగాణ సర్కార్‌. తాజాగా గాంధీ హాస్పిటల్‌ అభివృద్ధి కోసం పెద్దఎత్తున..

Gandhi Hospital: గాంధీ ఆస్పత్రి అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన సర్కార్.. భారీగా నిధుల కేటాయింపు..
Gandhi Hospital
Follow us on

కార్పొరేట్‌ హాస్పిటల్స్‌కి ఏమాత్రం తీసిపోకుండా గవర్నమెంట్‌ ఆస్పత్రులను తీర్చిదిద్దుతోంది తెలంగాణ సర్కార్‌. తాజాగా గాంధీ హాస్పిటల్‌ అభివృద్ధి కోసం పెద్దఎత్తున నిధులు కేటాయించింది ప్రభుత్వం. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలపై మరింత ఫోకస్‌ పెంచింది కేసీఆర్‌ సర్కార్‌. హాస్పిటల్స్‌ వారీగా నిధులు కేటాయిస్తూ మౌలిక వసతులను ఇంప్రూవ్‌ చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి ఆధునీకరణకు నిధులు విడుదలయ్యాయి. మొత్తం రూ. 14.56 కోట్లు మంజూరు చేస్తూ జీవో నెంబర్‌ 649 రిలీజ్‌ చేశారు అధికారులు. గాంధీ హాస్పిటల్‌లో శానిటేషన్‌ వ్యవస్థ పునర్ వ్యవస్థీకరణ కోసం ఈ నిధులను వినియోగించనున్నారు.

సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు ఆస్పత్రిలో పనులు చేపట్టనున్నారు అధికారులు. మెయిన్‌గా డ్రైనేజ్‌ వ్యవస్థ, వాష్ రూమ్స్‌ను మెరుగుపర్చనున్నారు. పదేపదే వాష్ రూమ్స్‌ బ్లాక్‌ కావడం, సెల్లార్ మొత్తం డ్రెయిన్‌ వాటర్‌తో కంపు కొడుతుండటంతో…శానిటేషన్‌ సిస్టమ్‌ను కంప్లీట్‌గా రెనోవేషన్‌ చేయనున్నారు. అలాగే, గాంధీ మెడికల్‌ కాలేజీలో కొత్తగా నాలుగు లిఫ్ట్‌లు ఏర్పాటు చేయనున్నారు. లిఫ్ట్‌ల కోసం కోటీ 62లక్షల రూపాయలను మంజూరు చేసింది ప్రభుత్వం. కొత్త లిఫ్ట్‌ల ఏర్పాటుతో వైద్య సిబ్బందికి, రోగులకు మరింత మెరుగైన సేవలు అందనున్నాయ్‌. శానిటేషన్‌ సిస్టమ్‌ రెనోవేషన్‌తో డ్రైనేజ్‌ సమస్యలు తీరిపోనున్నాయంటున్నారు గాంధీ ఆస్పత్రి వర్గాలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..