School Holiday: విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. జవనరి 1న అన్ని స్కూళ్లు, బ్యాంకులకు సెలవు ప్రకటించిన సర్కార్‌

|

Dec 26, 2023 | 1:19 PM

న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సర్కార్ గుడ్‌న్యూస్‌ చెప్పింది. డిసెంబర్ 31 రాత్రి 1 గంట వరకు ఈ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31 రాత్రి ఒంటి గంట వరకు పబ్‌లు, క్లబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు, హోటళ్లు తెరచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే అందుకు ముందస్తు అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. నూతన సంవత్సర వేడుకలు శాంతియుతంగా

School Holiday: విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. జవనరి 1న అన్ని స్కూళ్లు, బ్యాంకులకు సెలవు ప్రకటించిన సర్కార్‌
New Year Celebrations 2024
Follow us on

హైదరాబాద్‌, డిసెంబర్ 26: న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సర్కార్ గుడ్‌న్యూస్‌ చెప్పింది. డిసెంబర్ 31 రాత్రి 1 గంట వరకు ఈ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31 రాత్రి ఒంటి గంట వరకు పబ్‌లు, క్లబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు, హోటళ్లు తెరచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే అందుకు ముందస్తు అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. నూతన సంవత్సర వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంచిత సంఘటనలకు పాల్పడకూడదంటూ సూచనలు జారీ చేశారు.

జనవరి 1వ తేదీన పాఠశాలలకు సెలవు..

జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ సర్కార్ పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జనవరి 1వ తేదీని సాధారణ సెలవుగా ప్రభుత్వం ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి ప్రత్యామ్నాయంగా ఫిబ్రవరి రెండవ శనివారం సెలవును రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. నూతన సంవత్సర వేడుకల కోసం పార్టీలు నిర్వహించేవారు, పబ్‌లు, క్లబ్‌లు, ఇతర పార్టీల నిర్వాహకులకు హైదరాబాద్ పోలీసులు పలు సూచనలు ఇచ్చారు. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్‌ వినియోగం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా డ్రగ్స్, గంజాయి తీసుకున్నట్లు తెలిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.

బ్యాంకులకూ సెలవు..

తెలంగాణలో కొత్త సంవత్సరం సందర్భంగా నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద బ్యాంకులకు సెలవు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 1వ తేదీన సెలవు కాకుండా, జనవరిలో మరో మూడు సెలవులను కూడా రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. వీటన్నింటినీ సాధారణ సెలవుల్లో జాబితా చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.