ప్రేమ సరిహద్దులు దాటుతుంది. ప్రేమ అన్న రెండు పదాల మాట సరిహద్దులను మూడు ముళ్ల బంధంగా మారింది. భారతీయులు పాశ్చాత్య సంస్కృతి కి అలవాటు పడుతుంటే.. పాశ్చాత్య దేశాలలో మన భారతీయ సంస్కృతికి స్వాగతం పలుకుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి ఖండాంతరాలు దాటి యువతులు సాఫ్టు వేర్ విదేశీయుల తో ప్రేమలో పడుతున్నారు. ప్రేమ కు హద్దులు.. సరిహద్దులు ఉండవని, సాఫ్టు గా కనిపించే విదేశీయులకు మనసు ఇచ్చేస్తున్నారు. అంతే కాదండోయ్.. విదేశీయులైనప్పటికీ మన భారతీయ సంస్కృతికి ఆకర్షితులై హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి వేడుకలు జరుపుకుని పెళ్లిలో విశిష్టత ను చాటుతున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. పెళ్లి వేడుకలో తెలుగు సినీ పాటలకు స్పెయిన్ కుటుంబం స్టెప్పులు కూడా వేశారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి లోనీ మందడపు సత్యనారాయణ, సుజని దంపతుల కనిష్ట పుత్రిక లావణ్య కు స్పెయిన్ దేశానికి చెందిన మార్క్ మన్ సిల్లా అనే విదేశీ యువకుని తో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. అది కూడా పూర్తిగా హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహ వేడుక ను జరిపించడం తో పాటుగా స్పెయిన్ దేశం నుంచి వచ్చిన వరుని కుటుంబ సభ్యులు కూడా పంచ కండువాలు కట్టుకుని వేడుకలో పాల్గొన్నారు.
తెలుగు సినిమా పాటల్లో ఈ మధ్య ట్రెండింగ్ అయిన మహేష్ బాబు సాంగ్ కుర్చీ నీ మడత పెట్టి.. అనే మాస్ సాంగ్ కు స్టెప్పులు వేశారు. ఈ పెళ్లి వేడుకలో స్పెయిన్ కుటుంబం స్టెప్పులు వేయడం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. ఉన్నత చదువులు చదువుకుని..విదేశాలలో సాఫ్టు వేర్ ఉద్యోగాలు చేస్తూ…అక్కడే మంచి సాఫ్టు వేర్ విదేశీయుడు ను ప్రేమించి భారదేశంలో పెళ్ళిళ్ళు చేసుకుంటూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పాశ్చాత్య దేశాలకు వ్యాపించేల ఖమ్మం జిల్లా సత్తుపల్లి యువతులు కృషి చేస్తున్నారని స్థానికులు అనుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..