Unique Love: ఇక్కడ అమ్మాయి.. అక్కడ అబ్బాయి.. అమెరికా అబ్బాయిని హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్న తెలుగమ్మాయి..

|

Dec 09, 2022 | 7:55 AM

ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన అమ్మాయి, అక్కడి అబ్బాయిని ప్రేమించి ఇరువురు కుటుంబాలను ఒప్పించి హిందూ సంప్రదాయ పద్ధతిలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్‌ హౌజ్ లో వివాహం చేసుకున్నారు.

Unique Love: ఇక్కడ అమ్మాయి.. అక్కడ అబ్బాయి.. అమెరికా అబ్బాయిని హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్న తెలుగమ్మాయి..
Telangana Girl America Boy Marriage
Follow us on

ప్రేమ ఆస్థి-అంతస్తులు, ఉన్నవారు- లేనివారు ఇలాంటి బేధాలను చూసుకోదు.. ప్రస్తుతం ప్రేమ దేశ ఎల్లలు దాటింది. విదేశాల్లో చదువులు, ఉద్యోగాల నేపథ్యంలో అక్కడ తమకు నచ్చిన.. మనసు మెచ్చిన వారిని ప్రేమిస్తున్నారు. వారితో తమ జీవితాన్ని పంచుకోవడానికి పెద్దలను ఒప్పించి భారతీయ సాంప్రదాయంలో పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన అమ్మాయి, అక్కడి అబ్బాయిని ప్రేమించి ఇరువురు కుటుంబాలను ఒప్పించి హిందూ సంప్రదాయ పద్ధతిలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్‌ హౌజ్ లో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి అమెరికా నుండి చాలా మంది అబ్బాయి బందువులు హాజరయ్యారు. ఈ వివాహాన్ని చూడడం కోసం చాలామంది వచ్చి వీరి జంటను చూసి ఆశీర్వదించి వెళ్తున్నారు. వివరాల్లోకి వెళితే ..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణిలో AGM గా విధులు నిర్వహిస్తున్నటువంటి రామలింగం -ఉషారాణి దంపతుల కుమార్తె మానస ఉన్నత చదువులకోసం అమేరికాకు వేళ్లడం జరిగింది. అక్కడ తనతో పాటు MS కంప్యూటర్ చేస్తున్న తన క్లాస్ మెట్ ఫ్రెండ్ అయిన కానర్ రోగన్ తొ మానసకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. హిందూ సంప్రదాయం పద్ధతిలో పెరిగిన మానస ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి వారిని ఒప్పించి, తను ప్రేమించిన ప్రియుని తల్లిదండ్రులను కూడా ఒప్పించి హిందూ సాంప్రదాయ పద్ధతిలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్ హౌస్ లో వివాహం చేసుకోవడం జరిగింది. ఈ వివాహానికి అమెరికా నుండి చాలామంది అబ్బాయి బందులు రావడంతో వీరిని చూడడం కోసం భూపాల్ పల్లి ప్రజలు కళ్యాణ మండపం వచ్చి వారిని ఆశీర్వదించి వెళ్తున్నారు.

ఈ సందర్భంగా నవ వధువు మానస మాట్లాడుతూ.. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన క్రమంలో మా ఇద్దరికి పరిచయం ఏర్పడిందని చెప్పింది. తమ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పమని.. తమ రెండు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నామని.. హిందూ సాంప్రదాయ పద్ధతిలో భూపాల్ పెళ్లిలో వివాహం చేసుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది. తన భర్త కుటుంబకులు కూడా తమ పెళ్లి విషయంలో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

ఇవి కూడా చదవండి

వరుడు రోగన్ మాట్లాడుతూ.. భారతీయ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. ఇక్కడ పద్ధతులు అన్ని తనను ఆకట్టుకున్నాయని.. భారతీయ హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నామని తెలిపారు. తాను మానస జీవితం చివరి కలిసి జీవిస్తామని.. భారత దేశంలో పెళ్లి జరగడం చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.

Reporter: G.Peddesh , TV9, Telugu

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..