Telangana Formation Day: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. గోల్కొండ కోటలో జెండా ఎగురవేయనున్న కిషన్ రెడ్డి..

|

Jun 02, 2023 | 6:12 AM

తెలంగాణ స్వప్నం సాకారమై తొమ్మిది వసంతాలు పూర్తవుతోంది. పదో వసంతంలోకి అడుగుడితోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహిస్తోంది బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. జాతీయపతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ప్రారంభిస్తారు కిషన్‌ రెడ్డి. ఓవైపు బీఆర్ఎస్..

Telangana Formation Day: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. గోల్కొండ కోటలో జెండా ఎగురవేయనున్న కిషన్ రెడ్డి..
Golkonda Fort
Follow us on

తెలంగాణ స్వప్నం సాకారమై తొమ్మిది వసంతాలు పూర్తవుతోంది. పదో వసంతంలోకి అడుగుడితోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహిస్తోంది బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. జాతీయపతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ప్రారంభిస్తారు కిషన్‌ రెడ్డి. ఓవైపు బీఆర్ఎస్.. మరోవైపు కాంగ్రెస్ తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు నిర్వహిస్తుంటే… కేంద్ర సర్కార్ తరఫున అవతరణ దినోత్సవం జరుపుతోంది బీజేపీ.

ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా.. చారిత్రక గోల్కొండ కోటపై ఉదయం జాతీయపతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ప్రారంభిస్తారు కిషన్‌ రెడ్డి. తెలంగాణ సాధన ఏ ఒక్కరివల్లో సాధ్యం కాలేదనీ, సకల జనుల సమైక్య పోరాటంతో, 1200 మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ ఆవిర్భవించిందన్నారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. తెలంగాణ సాధనలో బీజేపీ తెలంగాణ గుండెచప్పుడయ్యిందన్నారు. సుష్మ స్వరాజ్ తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమానికి బీజేపీ ముందుండి నడిచిందన్నారు.

గవర్నర్ ఈ వేడుకలకు హాజరవుతారని తెలిపారు కిషన్‌ రెడ్డి. పలు సాంస్కృతిక కార్యాక్రమాలు సహా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాలు ఉంటాయని.. ప్రజలంతా తరలివచ్చి వేడుకల్లో పాల్గొనాలని అయన కోరారు. మోడీ తొమ్మిదేళ్ళ పాలనకు సంభందించి పోటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇక సాయంత్రం భారత సాంస్కృతిక వైభవంతో పాటు కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలపై రెండు చిత్రాల ప్రదర్శన ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..