Telangana: కాంగ్రెస్ ఆఫీస్ నుంచి పింక్ కారు స్వాధీనం.. అప్రజాస్వామికం అంటున్న కాంగ్రెస్

| Edited By: Ram Naramaneni

Nov 06, 2023 | 10:58 AM

తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ దగ్గర ఉన్న ఓ కారుని నాంపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కారు పింక్ కలర్ తో నిండి.. సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసినవి రాసి ఉన్నారు. కేసీఆర్ పై అభ్యంతకర వ్యాఖ్యలు రాసి ఉన్న కారును నవంబర్ 5వ తేదీ ఆదివారం నాంపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Telangana: కాంగ్రెస్ ఆఫీస్ నుంచి పింక్ కారు స్వాధీనం.. అప్రజాస్వామికం అంటున్న కాంగ్రెస్
Campaign Car Size
Follow us on

దేశంలో పలు రాష్ట్రాలతోసహా తెలంగాణలో కూడా ఎన్నికల నగారా మ్రోగింది. ఎన్నికల పోటీలో పాల్గొనే ప్రధాన పార్టీ అభ్యర్థులతో సహా పలువురు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. తెలంగాణాలో ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. పలువురు ప్రధాన పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేయడమే కాదు మరో వైపు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రజల మధ్యకు చేరుకుంటున్నారు. వివిధ రకాలుగా తమ పార్టీకి చెందిన అభ్యర్థులను గెలించమని కోరుతున్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ దగ్గర ఉన్న ఓ కారుని నాంపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కారు పింక్ కలర్ స్టిక్కరింగ్‌తో ఉంది. సీఎం కేసీఆర్  గురించి కారుపై అనుచిత వ్యాఖ్యలు రాసి ఉన్నాయి. కేసీఆర్ పై అభ్యంతకర వ్యాఖ్యలు రాసి ఉన్న ఈ కారును నవంబర్ 5వ తేదీ ఆదివారం నాంపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 కాంగ్రెస్ పార్టీ ఖండించింది.

దీనిపై అధికారిక సోషల్ మీడియా  X లో  స్పందించిన తెలంగాణ కాంగ్రెస్.. పోలీసుల తీరుపై సంచలన కామెంట్స్ చేసింది. “నాంపల్లిలోని కాంగ్రెస్ కార్యాలయం నుండి తమకు సంబంధించిన ‘KCR420’ ప్రచార కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాము చేస్తున్న ఎన్నికల ప్రచారం కల్వకుంట్ల కుటుంబంలోని అహంకారాన్ని దెబ్బతీసిందని పేర్కొన్నారు. తమ ఆఫీసులో ఉన్న కారుని పోలీసులు తీసుకుని వెళ్లడంపై అభ్యంతరం చెబుతూ.. పోలీసులు అధికారాన్ని అప్రజాస్వామికంగా ఉపయోగించారంటూ కాంగ్రెస్ ఫైరయ్యింది.

ఎన్నికల ప్రచారం కోసం  తెలంగాణ కాంగ్రెస్ నేతలు… అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)ని, ఆ పార్టీ నాయకత్వాన్ని అవహేళన చేస్తూ ఓ మోడల్ కారును ఏర్పాటు చేశారు. BRSతో సంబంధం ఉందంటూ పలు స్కామ్ ల గురించి ఆ కారుపై ప్రస్థావిస్తూ పింక్ కారును ప్రదర్శించారు. మద్యం అమ్మకాల ద్వారా బీఆర్‌ఎస్ డబ్బు సంపాదిస్తున్నదని ఆరోపిస్తూ కేసీఆర్ పాలనను “90 ఎంఎల్ ప్రభుత్వం”గా ఓ పోస్టర్ ను ఆ కారుపై ముద్రించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..