- Telugu News Photo Gallery Spiritual photos Dhanteras 2023: broom utensils shopping know here in Telugu
Dhanteras 2023: ధన్ తేరాస్ రోజున బంగారం, చీపుర్లను మాత్రమే కాదు.. ఇవి కూడా కొనడం శుభప్రదం
దీపావళి పండుగ ధన్ తేరాస్ నుండే ప్రారంభమవుతుంది. లక్ష్మీ దేవి, సంపదకు దేవుడు అయిన కుబేరులను ధనత్రయోదశి అనగా ధన్ తేరాస్ రోజున పూజిస్తారు. ఈ సంవత్సరం నవంబర్ 10వ తేదీ శుక్రవారం నాడు ధన్ తేరాస్ ను జరుపుకోనున్నారు. కుబేరుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు ధన్ తేరాస్ లో చాలా వస్తువులను కొంటారు. ధన్ తేరాస్ రోజున షాపింగ్ చేయడం శుభప్రదంగా భావిస్తారు.
Updated on: Nov 06, 2023 | 9:12 AM

హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్షంలోని త్రయోదశి నాడు ధన త్రయోదశి లేదా ధన్ తేరాస్ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు పాత్రలు, ఇళ్లు, వాహనాలు, గాడ్జెట్లు, బంగారం, వెండి నగలు కొనుగోలు చేస్తారు. అంతేకాదు ధన్‌తేరస్‌లో కొనుగోలు చేయడం శుభప్రదంగా భావించే అనేక ఇతర వస్తువులు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం..

ధన్ తేరాస్ రోజున చీపురు కొనడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. చీపురు లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. చీపురు ఇంటి నుండి మురికి, దుమ్ము తొలగించడానికి ఉపయోగిస్తారు. ధన్‌తేరస్‌లో ప్రజలు ఖచ్చితంగా చీపుర్లను కొనుగోలు చేయడానికి ఇదే కారణం.

ధన్‌తేరస్ రోజున చీపుళ్లతో పాటు లక్ష్మీ చరణాలను కొంటారు. నిజానికి ఈ రోజు నుంచే దీపావళి పండగ జరుపుకోవడానికి సన్నాహాలు కూడా చేస్తారు. ధన త్రయోదశి నాడు లక్ష్మీ చరణాలను కొనుగోలు చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది లక్ష్మీదేవి ప్రవేశానికి ఆహ్వానంగా భావిస్తారు. లక్ష్మీ దేవి పాదాలను లోపలికి వచ్చే ప్రధాన ద్వారం వద్ద ఉంచవచ్చు లేదా వాటిని పూజా స్థలంలో ఉంచవచ్చు.

ధన్‌తేరస్ రోజున తమలపాకులను కొనడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. తమలపాకులు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవని చెబుతారు. కావున ధన్‌తేరస్ నాడు 5 తమలపాకులను కొని వాటిని లక్ష్మీదేవికి సమర్పించండి. ఈ ఆకులను దీపావళి వరకు అలాగే ఉంచి ఆపై వాటిని ప్రవహించే నీటిలో విడిచిపెట్టాలి.

నరక చతుర్దశి.. ద్వాపర యుగంలో ఈ ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథిలో శ్రీ కృష్ణుడు, సత్యభామ తో కలిసి నరకాసురుడిని సంహరించాడు. అప్పటి నుండి నరక చతుర్దశి పండుగను జరుపుకుంటారు. నరక చతుర్దశి రోజున ఐదు లేదా ఏడు దీపాలు వెలిగించే సంప్రదాయం కూడా ఉంది. ఈసారి ఈ పండుగను 11 నవంబర్ 2023 న జరుపుకోనున్నారు.





























