Telangana Politics: నల్గొండలో వారసులు వచ్చేస్తున్నారు.. తనయుల గ్రాండ్ ఎంట్రీకి గ్రౌండ్ రెడీ చేస్తున్న దిగ్గజ నేతలు..

దీపం ఉండగానే ఇంటిని చక్క పెట్టు కోవాలని పెద్దలు చెబుతుంటారు. అయితే ఆ నానుడిని నల్లగొండ జిల్లా నేతలు ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు. వారసులను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా అరంగ్రేటం చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ముఖ్య నేతలు సిద్ధమయ్యారు. తనయుల పొలిటికల్ ఎంట్రీకి నేతలు తంటాలు పడుతున్నారు. రాజకీయాల్లో తల పండిన ఈ నేతలు..కొడుకులను రాజకీయ నేతలుగా తీర్చిదిద్దే పనిలోపడ్డారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఈ దిగ్గజాలు వ్యూహరచన చేస్తున్నారు.

Telangana Politics: నల్గొండలో వారసులు వచ్చేస్తున్నారు.. తనయుల గ్రాండ్ ఎంట్రీకి గ్రౌండ్ రెడీ చేస్తున్న దిగ్గజ నేతలు..
Nalgonda Politics

Edited By: Janardhan Veluru

Updated on: Jul 03, 2023 | 3:12 PM

Nalgonda Politics: దీపం ఉండగానే ఇంటిని చక్క పెట్టు కోవాలని పెద్దలు చెబుతుంటారు. అయితే ఆ నానుడిని నల్లగొండ జిల్లా నేతలు ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు. తమ రాజకీయ వారసులను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా అరంగ్రేటం చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ముఖ్య నేతలు గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు. తనయుల పొలిటికల్ ఎంట్రీకి నేతలు తంటాలు పడుతున్నారు. రాజకీయాల్లో తల పండిన ఈ నేతలు..కొడుకులను రాజకీయ నేతలుగా తీర్చిదిద్దే పనిలోపడ్డారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఈ దిగ్గజాలు వ్యూహరచన చేస్తున్నారు.

తెలంగాణ రాజకీయాల్లో దిగ్గజ నాయకుడు.. తల పండిన నేత..ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రంలోనే అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన ఘన చరిత్ర కలిగిన నేత అతను. ఆ నేత తనయుల పొలిటికల్ ఎంట్రీకి తహాతహాలాడుతున్నాడు. ఆయన ఎవరో కాదు సీఎల్పీ మాజీ నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె.జానారెడ్డి. వయో భారంతో పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకుంటున్న జానారెడ్డి..తన కొడుకులు రఘువీర్, జయవీర్ రెడ్డిల పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేశాడు. జనారెడ్డి ఎన్నికల్లో వారసులే కీరోల్ పోషించారు. ఇద్దరూ వారసులను నాగార్జున సాగర్, మిర్యాలగూడలో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. కొత్తగా రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న జయవీర్ వచ్చే ఎన్నికల్లో తండ్రి స్థానంలో సాగర్ బరిలో దిగనున్నారు. నాగార్జున సాగర్ లో జైవీర్ రెడ్డి ‘బ్రింక్ బ్యాక్ కాంగ్రెస్’ పేరుతో గిరిజన చైతన్య యాత్ర చేశారు. తన తండ్రి హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించి ప్రయత్నం చేస్తున్నారు.

మిర్యాలగూడలో పోటీకి సిద్ధమైన పెద్ద కొడుకు రఘువీర్ రెడ్డి కొద్దిరోజుల కింద స్థానికంగా ఇంటిని కొన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంపై జానా రెడ్డికి మంచి పట్టు ఉంది. మిర్యాలగూడలో రఘువీర్ రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పటికే అనుచర గణంతో జానారెడ్డి ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించారు. మిర్యాల గూడనుంచి రఘువీర్ ఎన్నికల కార్యాచరణ మొదలు పెట్టారు. జానారెడ్డి కుమారులకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో మంచి సంబంధాలు కలిగి ఉండటం రాజకీయంగా మరింత బలాన్ని సమకూర్చింది. అయితే వచ్చే ఎన్నికల్లో కొడుకుల ఇద్దరికీ టికెట్లు కోసం జానారెడ్డి తంటాలు పడుతున్నారు. కొడుకుల పొలిటికల్ ఎంట్రీ టికెట్ల కోసం జానా రెడ్డి సర్వశక్తులు వడ్డుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరో సీనియర్ నేత శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ కి రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే తన తాత గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ పేరుతో నల్గొండ, మునుగోడు నియోజకవర్గాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన చిరకాల వాంఛ మంత్రి పదవి చేపట్టని గుత్తా సుఖేందర్ రెడ్డి.. తన కొడుకును ఎమ్మెల్యేగా శాసనసభకు పంపాలని ప్రయత్నిస్తున్నారు. గుత్తా కుమారుడు అమిత్ రెడ్డికి టికెట్ ఇంకా కన్ఫర్మ్ కాకపోయినప్పటికీ మునుగోడు, నల్లగొండల్లో అమిత్ ఎంట్రీ రాజకీయ వేడీ పుట్టిస్తోంది. గుత్తాకు మునుగోడు, నల్లగొండ నియోజక వర్గాలతో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా అమిత్ వచ్చే ఎన్నికల్లో వాటిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాల్సి వస్తే నెక్ట్స్ చాన్స్ అమిత్ దక్కేలా గుత్తా సుఖేందర్రెడ్డి ప్రయత్నిస్తున్నారట. ఏదో ఒక స్థానంలో తన కొడుకుకు టికెట్ లభించేలా తన రాజకీయ అనుభవానికి గుత్తా పదును పెడుతున్నారట.

మొత్తానికి వారసుల పొలిటికల్ ఎంట్రీ కోసం తండ్రులు తంటాలు పడుతున్నారు. వయోభారం మీద పడుతున్న నేపథ్యంలో ఈ రాజకీయ దిగ్గజాలకు కొడుకుల రాజకీయ భవితవ్యంపై బెంగ పెట్టుకున్నారట. కాలం కలిసి వచ్చి శాసనసభలో తనయులు అడుగు పెట్టాలన్న వీరి కోరిక నెరవేతుందో లేదో వేచి చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..