AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: 15 రోజులు.. 54 సభలు.. సీఎం కేసీఆర్ నాన్ స్టాప్ ప్రచారం.. మలి విడత షెడ్యూల్ ఇదే..

CM KCR Second Phase Election Campaign: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో హ్యాట్రిక్‌ టార్గెట్‌గా బీఆర్‌ఎస్‌ ప్రచారపర్వంలో దూసుకెళ్తోంది. రంగంలోకి దిగిన భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రజాశీర్వాద సభలతో జోష్‌ను పెంచుతున్నారు. ఇప్పటికే మొదటి విడత ప్రచారం కొనసాగుతోంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ 9న నామినేషన్ వేయనున్నారు.

CM KCR: 15 రోజులు.. 54 సభలు.. సీఎం కేసీఆర్ నాన్ స్టాప్ ప్రచారం.. మలి విడత షెడ్యూల్ ఇదే..
CM KCR
Shaik Madar Saheb
|

Updated on: Nov 04, 2023 | 9:14 PM

Share

CM KCR Second Phase Election Campaign: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో హ్యాట్రిక్‌ టార్గెట్‌గా బీఆర్‌ఎస్‌ ప్రచారపర్వంలో దూసుకెళ్తోంది. రంగంలోకి దిగిన భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రజాశీర్వాద సభలతో జోష్‌ను పెంచుతున్నారు. ఇప్పటికే మొదటి విడత ప్రచారం కొనసాగుతోంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ 9న నామినేషన్ వేయనున్నారు. ఆ ఆరువాత ప్రచారానికి స్పల్ప విరామం ఇస్తారు. మళ్లీ ఈనెల 13 నుంచి 28 వరకు సీఎం కేసీఆర్‌ మలివిడత ప్రచారం మొదలు పెట్టనున్నారు. రెండో విడత ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ 54 సభల్లో ప్రసంగించనున్నారు. 25న గ్రేటర్‌ మొత్తానికి కలిపి ఒకే ఒక సభ ఉండనుంది. 13 నుంచి నాన్ స్టాప్ ప్రచారంతో గులాబీ దళపతి.. దూసుకెళ్లనున్నారు.

కేసీఆర్ మలివిడత ప్రచారానికి సంబందించిన షెడ్యూల్‌ను ఒకసారి చూడండి..

  • 13న అశ్వారావు పేట, బూర్గంపహాడ్‌, నర్సంపేట
  • 14న పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నం
  • 15 న బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌ , ఎల్లారెడ్డి, మెదక్‌
  • 16న ఆదిలాబాద్‌, బోథ్‌, నర్సాపూర్‌, నిజామాబాద్‌ రూరల్‌
  • 17న కరీంనగర్‌, చొప్పదండి, హుజూరాబాద్‌, పరకాల
  • 18న చేర్యాల
  • 19న అలంపూర్‌, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి
  • 20న మానకొండూర్, స్టేషన్‌ఘన్‌పూర్, నకిరేకల్, నల్గొండ
  • 21న మధిర, వైరా, డోర్నకల్‌, సూర్యాపేట
  • 22న తాండూర్‌, కొడంగల్‌, మహబూబ్‌నగర్‌, పరిగి
  • 23న మహేశ్వరం, వికారాబాద్‌, జహీరాబాద్‌, పటాన్‌చెరు
  • 24న మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి
  • 25న గ్రేటర్‌ హైదరాబాద్‌లో కేసీఆర్‌ భారీ బహిరంగ సభ
  • 26న ఖానాపూర్‌, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక
  • 27న షాద్‌నగర్‌, చేవెళ్ల, ఆంధోల్‌, సంగారెడ్డి
  • 28న వరంగల్‌ ఈస్ట్‌, వరంగల్‌ వెస్ట్‌, గజ్వేల్‌

ఇలా రెండో విడతలో సీఎం కేసీఆర్‌ మొత్తం 54 సభల్లో పాల్గొననున్నారు.