Telangana Election: ఎలక్షణ్ కోడ్ నేపథ్యంలో అబ్కారీ శాఖ అలర్ట్.. మద్యం సరఫరా డిస్టిలరీలపై నజర్

| Edited By: Balaraju Goud

Nov 15, 2023 | 7:25 AM

రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో మద్యం అమ్మకాలపై అధికారులు దృష్టిపెట్టారు. మద్య సరఫరాపైనా సైతం అధికారులు ఒక నజర్ వేశారు. ఎన్నికల సీజన్‌లో రాజకీయ పార్టీలు మద్యంతో ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో భాగంగానే ఆబ్కారీ శాఖ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది.

Telangana Election: ఎలక్షణ్ కోడ్ నేపథ్యంలో అబ్కారీ శాఖ అలర్ట్.. మద్యం సరఫరా డిస్టిలరీలపై నజర్
Excise Distilleries Inspection
Follow us on

రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో మద్యం అమ్మకాలపై అధికారులు దృష్టిపెట్టారు. మద్య సరఫరాపైనా సైతం అధికారులు ఒక నజర్ వేశారు. ఎన్నికల సీజన్‌లో రాజకీయ పార్టీలు మద్యంతో ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో భాగంగానే ఆబ్కారీ శాఖ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేసే వాళ్లను ఓ కంట కనిపెట్టేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది రాష్ట్ర అబ్కారీ శాఖ.

ఈ నేపథ్యంలోనే ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తున్న తరుణంలో మద్యం డిస్టిలరీ కేంద్రాలపై నిఘా పెట్టారు ఎక్సైజ్ శాఖ అధికారులు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు మేరకు డిస్టిలరీ సెంటర్లకు వెళ్లి పరిశీలించారు ఎక్సైజ్ శాఖ అధికారులు. ఎలక్షన్ కమిషన్ పరిశీలకులు సూచనల మేరకు హైదరాబాద్ ఉన్న పది డిష్టిలరీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు హైదరాబాద్ ఎక్సైజ్ శాఖ సూపరిండెంట్ విజయ్.

డిస్టిలరీ గోదాముల్లో ప్రస్తుతం ఉన్న నిల్వలను పరిశీలించారు ఎక్సైజ్ ఈఎస్. ప్రస్తుతం మద్యం షాపులకు అవుతున్న సరఫరా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన లాగ్ బుక్‌లను పరిశీలించారు ఈఎస్ విజయ్. 10 బృందాలుగా ఏర్పడి ఎక్సైజ్ అధికారులు, హైదరాబాద్‌లో ఉన్న అన్ని డిస్టిలరీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని డిస్టిక్ గోదాములలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించారు ఎక్సైజ్ శాఖ అధికారులు. అవసరమైతే మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

తనిఖీల సందర్భంగా ఎలాంటి ఉల్లంఘనలు గుర్తించలేదని పోలింగ్ తేదీ వరకు నిరంతరం నిఘా కొనసాగుతుందని తెలిపారు ఎక్సైజ్ శాఖ అధికారి విజయ్. నిబంధనలు పాటించకుండా ఎక్కువ మొత్తంలో మద్యం కొనుగోళ్లు చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇదిలావుంటే ఇంట్లో ఏదైనా శుభకార్యాలు, వేడుకలు జరిగితే మద్యం సరఫరాకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని అబ్కారీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. గతంలో ఎలాంటి హామీ పత్రం లేకుండానే అనుమతి ఇచ్చేవారు. రూ. 12 వేలు చెల్లించి స్థానిక ఆబ్కారీ అధికారులకు దరఖాస్తు చేసే అనుమతి ఇచ్చేవారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాజకీయాలతో సంబంధం లేదని బాండ్‌ రాసిస్తేనే అనుమతి ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముందస్తుగా తమకు.. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. రూ. 100 బాండ్‌ పేపర్‌పై ఈ విషయాన్ని స్పష్టం చేయాలి.

ఇదిలా ఉంటే కొన్ని పార్టీల నాయకులు అధికారులను బురిడికొట్టిస్తున్నారు. మద్యం పార్టీలు నిర్వహిస్తే ఎన్నికల నిబంధనలకు విరుద్దమని తెలిసి.. పుట్టిన రోజు వేడుకలు, ఆత్మీయ సమ్మేళనాల పేరుతో పార్టీలను నిర్వహిస్తున్నారు. ఫంక్షన్‌ హాల్స్‌, రిసార్డులను అద్దెకు తీసుకొని పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి వాటిపైన నిఘా పెట్టినట్టు హైదరాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్ విజయ్ తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఎవరు ఉల్లంఘించిన ఉపేక్షించేందీ లేదన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…