AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP Manifesto: మేనిఫెస్టోకు బీజేపీ ఫినిషింగ్ టచెస్.. నాలుగు తాయిలాలతో గిఫ్ట్‌ బాక్స్ రెడీ!

తెలంగాణ దంగల్‌లో వెనకబడ్డామన్న వార్తలను కొట్టిపారేస్తూ.. పసందైన మేనిఫెస్టోతో జనం ముందుకు వచ్చేస్తున్నాం అంటోంది కమలం పార్టీ. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అన్నట్లు సాగతోంది కాషాయ దళం. ఇప్పటికే తెలంగాణను రౌండప్ చేసిన బీజేపీ అగ్రనేతల చేతుల మీదుగానే తాయిలాల చిట్టా కూడా విడుదల చేయాలన్నది భారతీయ జనతా పార్టీ ప్లాన్.

BJP Manifesto: మేనిఫెస్టోకు బీజేపీ ఫినిషింగ్ టచెస్.. నాలుగు తాయిలాలతో గిఫ్ట్‌ బాక్స్ రెడీ!
Amit Shah On Manifesto
Balaraju Goud
|

Updated on: Nov 15, 2023 | 6:49 AM

Share

తెలంగాణ దంగల్‌లో వెనకబడ్డామన్న వార్తలను కొట్టిపారేస్తూ.. పసందైన మేనిఫెస్టోతో జనం ముందుకు వచ్చేస్తున్నాం అంటోంది కమలం పార్టీ. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అన్నట్లు సాగతోంది కాషాయ దళం. ఇప్పటికే తెలంగాణను రౌండప్ చేసిన బీజేపీ అగ్రనేతల చేతుల మీదుగానే తాయిలాల చిట్టా కూడా విడుదల చేయాలన్నది భారతీయ జనతా పార్టీ ప్లాన్. కానీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మించి బీజేపీ మేనిఫెస్టోలో ఏమేం ఉండబోతున్నాయి.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేంత స్టఫ్ ఏముంటుంది అనే ఆసక్తి నెలకొంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో..

ఆరు గ్యారంటీలు ప్లస్ ఆరు డిక్లరేషన్లు.. బిగ్‌ఫైట్‌కు రెడీ అంటోంది కాంగ్రెస్‌ పార్టీ. పాత పథకాలకు కొత్త కలర్లు అద్ది ఎట్రాక్టివ్ స్టయిల్‌తో దంగల్‌లో దూకేసింది అధికార పార్టీ బీఆర్‌ఎస్. తెలంగాణలో మరో అపోజిషన్ పార్టీ బీజేపీ మాత్రం మేనిఫెస్టో రాసుకోవడంలో కాస్త వెనకబడింది. ఇన్నాళ్లూ అభ్యర్థుల జాబితాల కసరత్తుతోనే సరిపోయింది. నామినేషన్ల దాఖలు అఖరి రోజున తుది జాబితాను ప్రకటించింది. అసమ్మతుల్ని బుజ్జగించడం మీదే ఫోకస్ పెట్టింది. ఎన్నికలకు మరో రెండువారాలు మాత్రమే గ్యాప్ ఉండడంతో ఇప్పుడు ప్రచారంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది బీజేపీ. ముఖ్య నాయకులను రంగంలోకి దించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. నోటిఫికేషన్ వచ్చాక ఇప్పటికే రెండు సార్లు తెలంగాణలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ, నవంబర్ నెల ఆఖర్లో 25, 26,27 తేదీల్లో మరోసారి సుడిగాలి పర్యటన చెయ్యబోతున్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా టూర్‌ కూడా దాదాపుగా ఖరారైంది. నవంబర్ 17న తెలంగాణలో పర్యటిస్తారు అమిత్ షా. ఒకే రోజు నాలుగు సభలకు ప్లాన్ చేసింది తెలంగాణ బీజేపీ. నల్గొండ, వరంగల్, గద్వాల్, రాజేంద్రనగర్‌లో అమిత్‌ షా పబ్లిక్ మీటింగ్స్‌కి ఏర్పాట్లు మొదలయ్యాయి. అదే రోజు బీజేపీ తెలంగాణ మేనిఫెస్టో రిలీజ్ చేయాలన్నది కమలనాథుల ఎన్నికల ఎత్తుగడ. ఇప్పటికే మేనిఫెస్టోను రూపొందించిన కాషాయ దళం.. తుది మెరుగులు అద్దుతోంది. జనరంజకంగా హామీలు ఉండేలా ఫ్లాన్ చేస్తున్నారు బీజేపీ నేతలు.

తెలంగాణ ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా బీజేపీ మేనిఫెస్టోకు రూపకల్పన జరుగుతోంది. ఇప్పుడున్న పథకాల్ని కొనసాగిస్తూనే కొత్త పథకాల్ని ప్రవేశపెడతామని ఇప్పటికే ప్రకటించారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి. బీసీలకు ముఖ్యమంత్రి కుర్చీనిస్తామన్న అతిపెద్ద హామీతో ఎంతోకొంత సెన్సేషన్‌ క్రియేట్ చేసిన బీజేపీ… మేనిఫెస్టోలో కూడా బీసీల సాధికారత కోసం ప్రత్యేక పథకాలు ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణలో హైదరాబాద్‌ సహా కొన్ని ప్రాంతాల పేర్ల మార్పు.. ఇప్పటికే బీజేపీ పరిశీలనలో ఉంది. అటు.. ఉచిత విద్య, ఉచిత వైద్యం లాంటి మరికొన్ని కీలక అంశాలు కూడా బీజేపీ మేనిఫెస్టోలో ఉండే ఛాన్సుంది. ఉపాధి అవకాశాలపై ఫోకస్ పెంచుతూ, నిరుద్యోగ యువతే టార్గెట్‌గా జాబ్ క్యాలెండర్ ప్రకటన కూడా ఉండొచ్చట.

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టోలకు భిన్నంగా… వినూత్నంగా ఉండేలా ప్లాన్ చేస్తోంది బీజేపీ. ఆరు గ్యారంటీలతో పాటు, అన్ని వర్గాల్నీ లక్ష్యంగా మార్చుకుని డిక్లరేషన్లు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అటు.. హ్యాట్రిక్ ఛాన్స్ ఇవ్వాలంటూ ఆకట్టుకునే హామీలతో దూకుడు మీదుంది అధికార బీఆర్‌ఎస్. ఆసరా పెన్షన్ పెంపు, గ్యాస్ సిలిండర్ల ధర తగ్గింపు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం… లాంటి జనరంజక హామీలతో ఆ రెండు పార్టీలూ ముందు వరసలో నిలబడ్డాయి. మరి.. వీళ్లిద్దరికీ మించి బీజేపీ ఇంకా ఏమేం హామీలు గుప్పిస్తుంది.. అనేది సస్పెన్స్..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…