AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress Manifesto: వచ్చే వారం కాంగ్రెస్ పూర్తి స్థాయి మానిఫెస్టో.. 6 గ్యారెంటీలతోపాటు మరికొన్ని హామీలు..!

తెలంగాణ ఎన్నికల వేళ ఓటర్లపై రాజకీయ పార్టీలు వరాలు జల్లులు కురిపిస్తామని హామీ ఇస్తున్నాయి. తమ పార్టీకి అధికారం అప్పగిస్తే.. ఏం చేయాలో టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ నీ ఏర్పాటు చేసుకుని మాజీ మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబును ఆ కమిటీ అధ్యక్షుడిగా చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ కమిటీ కి మానిఫెస్టో రూపకల్పన పై పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చింది. ఇప్పటికే మేనిఫెస్టో రూపకల్పన కోసం అనేక జిల్లాల పర్యటనతో పాటు హైదరాబాద్‌లో అనేక సంఘాల నుంచి వినతులు తీసుకున్నది మేనిఫెస్టో కమిటీ..

Congress Manifesto: వచ్చే వారం కాంగ్రెస్ పూర్తి స్థాయి మానిఫెస్టో.. 6 గ్యారెంటీలతోపాటు మరికొన్ని హామీలు..!
Congress Manifesto
TV9 Telugu
| Edited By: |

Updated on: Oct 21, 2023 | 6:47 PM

Share

ఇప్పటికే ఆరు గ్యారెంటీల హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో తమదే విజయం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేస్తూ.. వచ్చే ఎన్నికల్లో తమ అధికారం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆరు గ్యారెంటీల ప్రకటనతో తమదే అధికారం అని భావిస్తున్న కాంగ్రెస్.. ఈ హామీలు సరిపోవని మరికొన్ని హామీలు ఇచ్చేందుకు మేనిఫెస్టో రూపంలో సిద్ధమవుతోంది.

తెలంగాణ ఎన్నికల వేళ ఓటర్లపై రాజకీయ పార్టీలు వరాలు జల్లులు కురిపిస్తామని హామీ ఇస్తున్నాయి. తమ పార్టీకి అధికారం అప్పగిస్తే.. ఏం చేయాలో టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ నీ ఏర్పాటు చేసుకుని మాజీ మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబును ఆ కమిటీ అధ్యక్షుడిగా చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ కమిటీ కి మానిఫెస్టో రూపకల్పన పై పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చింది. ఇప్పటికే మేనిఫెస్టో రూపకల్పన కోసం అనేక జిల్లాల పర్యటనతో పాటు హైదరాబాద్‌లో అనేక సంఘాల నుంచి వినతులు తీసుకున్నది మేనిఫెస్టో కమిటీ..

అయితే అనేక చర్చిల తర్వాత ఇప్పుడు అమలవుతున్న పథకాలను మరింత మెరుగుపరుస్తూ.. మరికొన్ని విధానపరమైన నిర్ణయాలు, అభివృద్ధి పనుల శంకుస్థాపనకు సంబంధించిన డిటెయిల్ రిపోర్ట్ మేనిఫెస్టోలో ఉంటుందని మేనిఫెస్టో కమిటీ చెబుతోంది. వచ్చే వారం అధికారికంగా మానిఫెస్టో విడుదల చేస్తామని మానిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు తెలిపారు. అనేక సమస్యలకు పరిష్కారంతోపాటు కొత్త హామీలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుందని అయిన చెప్పారు. ప్రకటించిన ఆరు గ్యారంటీలు కాకుండా కొత్తగా కొన్ని హామీలు ఉండబోతున్నాయని స్పష్టం చేశారు. మా గ్యారెంటీలు సాధ్యం కాదని బీఆర్ఎస్ చెప్తూనే మా గ్యారెంటీలలో మార్పులు చేసి బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించింది అని తీవ్రంగా ఆరోపించారు. సింగరేణి కార్మికులతో పాటు ఉద్యోగుల విషయంలోనూ ఒక స్పష్టమైన వైఖరిని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రూపంలో తెలపాలని అనుకుంటున్నట్టు శ్రీధర్ బాబు తెలిపారు. దీంతో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎటువంటి అంశాలు ఉంటాయని ఆసక్తి నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…