Telangana: చోరీలందు ఈ చోరీలు వేరయా.. మాయ మాటలతో బురిడి కొట్టిస్తున్న కేటుగాళ్లు

| Edited By: Ram Naramaneni

Aug 13, 2023 | 5:06 PM

నిర్మల్ జిల్లా ముదోల్ నియోజక వర్గ పరిదిలో వరుసగా మూడు చోట్ల బంగారు దొంగ తనాలు జరిగాయి. కానీ ఈ చోరీలు చైన్ స్నాచింగ్ చోరీలు మాత్రం కాదు. అంతకు మించి.. పక్క ప్రణాళిక ప్రకారం చేస్తున్న చోరీలే ఇవి. మహిళ లు , వృద్దులే లక్ష్యం గా ఈ చోరీలు‌ సాగుతున్నాయి. ఈ నెల ఆగస్టు 4 న బాసర మండల కేంద్రంలో, ఆగస్టు 10 న కుభీర్ మండల కేంద్రంలో ఆగస్టు 12 న కుంటాల మండలం కల్లూరు లో మూడు చోట్ల ఒకే తరహా చోరీలు. వరుస చోరీలకు పాల్పడిన దుండగులు‌ ఎంచుకున్న రూట్ వేరైనా చోరీ చేసిన విధానం మాత్రం సేమ్ టూ..

Telangana: చోరీలందు ఈ చోరీలు వేరయా.. మాయ మాటలతో బురిడి కొట్టిస్తున్న కేటుగాళ్లు
Victim Women
Follow us on

నిర్మల్, ఆగస్టు 13: నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ లో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. వృద్దులు , మహిళలనే టార్గెట్ గా చేసుకుని చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. ఆశలు కల్పిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు వరుసగా ముచ్చటగా మూడు ఘటనలు చోటు చేసుకోవడం.. ఆ మూడు ఘటనల్లోను అత్యాసకు పోయి ఒంటి మీద నగలు కోల్పోవడం బాధితుల వంతైంది. లక్కీ లాటరీ తగిలింది ఓ చోట.. బంఫర్ ఆపర్ అంటూ మరో చోట.. బ్యాంక్ లో డబ్బులు పడ్డాయంటూ మరో చోట నమ్మించి నట్టెట ముంచేశారు కేటుగాళ్లు.

నిర్మల్ జిల్లా ముదోల్ నియోజక వర్గ పరిదిలో వరుసగా మూడు చోట్ల బంగారు దొంగ తనాలు జరిగాయి. కానీ ఈ చోరీలు చైన్ స్నాచింగ్ చోరీలు మాత్రం కాదు. అంతకు మించి.. పక్క ప్రణాళిక ప్రకారం చేస్తున్న చోరీలే ఇవి. మహిళ లు , వృద్దులే లక్ష్యం గా ఈ చోరీలు‌ సాగుతున్నాయి. ఈ నెల ఆగస్టు 4 న బాసర మండల కేంద్రంలో, ఆగస్టు 10 న కుభీర్ మండల కేంద్రంలో ఆగస్టు 12 న కుంటాల మండలం కల్లూరు లో మూడు చోట్ల ఒకే తరహా చోరీలు. వరుస చోరీలకు పాల్పడిన దుండగులు‌ ఎంచుకున్న రూట్ వేరైనా చోరీ చేసిన విధానం మాత్రం సేమ్ టూ సేమ్. ఈనెల ఆగస్టు 4 న బాసర మండల కేంద్రానికి చెందిన రేఖ అనే మహిళను లాటరీ లో కార్ వచ్చిందని నమ్మించి బురిడి కొట్టించాడు. బ్యాంక్ లో డబ్బులు డ్రా చేయాలంటే కొంతైనా బంగారం బ్యాంక్ లో చూపాలంటూ చెప్పి 2 తులాల బంగారం గొలుసుతో ఉడాయించాడు.

ఈ ఘటన జరిగిన‌ వారానికి ఆగస్టు 10 న కుభీర్ మండల కేంద్రానికి చెందిన భోజవ్వ అనే వృద్ధురాలు ఇంటికి వెళ్లి మేము బ్యాంక్ నుండి వచ్చాము మీ అకౌంట్ లో 50 వేల రూపాయలు జమ అయ్యాయి.. మీరు మాతో బ్యాంక్ కు వచ్చి సంతకం చేయాలని మాయ మాటలు చెప్పి నమ్మించారు. మీ ఒంటి మీద ఉన్న బంగారం మీ ఆయన వద్ద ఉంచి మాతో రావాలని తీసుకెళ్లిన దుండగుడు భోజవ్వను మధ్యలో నే దింపేసి.. తిరిగి వెనక్కి వచ్చి వికలాంగుడైన భోజవ్వ భర్తను కత్తితో బెదిరించి భోజవ్వ వద్ద ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. ఈ రెండు వరుస ఘటనలు మరువక ముందే.. ఆగస్టు 12 న కుంటాల మండలం కల్లూరు గ్రామానికి చెందిన పెద్దమ్మి అనే మహిళను టార్గెట్ చేసిన దుండగుడు.. మీ ఫోన్ నెట్ వర్క్ మారారు.. దీంతో మీకు లాటరీ లో బంగారం వచ్చింది అని నమ్మ బలికాడు ఆ దుండగుడు. మీ‌ దగ్గర ఉన్న బంగారం ఎంతుంటే అంతలు‌ రెండు రెట్ల బంగారం ఇస్తానంటూ నమ్మించి కొంత దూరం తీసుకెళ్లి ఆ మహిళను దించేసి పరారయ్యాడు.

ఇవి కూడా చదవండి

ఇలా వరుసగా జరిగిన మూడు ఘటనల్లో అత్యాసకు పోయి నిండా మునిగారు బాదితులు. ఈ మూడు ఘటనలే కాదు ఇదే ప్రాంతంలోని కుభీర్, అర్లీ గ్రామాల్లోను ఇదే తరహా మోసాలకు పాల్పడేందుకు ప్రయత్నించగా ఆ మహిళలు పల్లెటవడంతో ఘరానా మోసం నుండి బయటపడగలిగారు ఈ వరుస ఘటన నేపథ్యంలో పోలీసులు నిఘా వ్యవస్థను పెంచారు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు మీ గ్రామాల్లో సంచరిస్తున్నట్టుగా గాని మీ ఇంటి వద్దకు వచ్చి లక్కీ లాటరీ తగిలిందని గాని చెప్తే నమ్మద్దని పోలీసులకు‌ సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులతో సమాచారాన్ని పంచుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు బైంసా డివిజన్ పోలీసులు. త్వరలోనే దుండగులను పట్టుకుంటామంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.