Telangana EAMCET Syllabus: తెలంగాణ ఎంసెట్ సిలబస్ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్ పరీక్షలకు 70 శాతం సిలబస్‌తో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి కారణంగా విద్యారంగంపై తీవ్ర ప్రభావం పడింది. కళాశాలలు, పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో ఇంటర్‌మీడియేట్ పరీక్షలను 70 శాతం సిలబస్‌తో ఫైనల్ పరీక్షలు నిర్వహించి మిగతా 30 శాతం సిలబస్‌ను అసైన్‌మెంట్, ప్రాజెక్టుల రూపంలో బోధన చేశారు.
ఇంటర్ సిలబస్ ఆధారంగా ఎంసెట్ పరీక్షలు జరుగుతాయి. అయితే సిలబస్ తక్కువగా ఉండటంతో విద్యార్థులపై భారం పడుతుందని అధికారులు భావించారు. ఎంసెట్‌ను కూడా అదే సిలబస్‌తో నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారుల ద్వారా సమాచారం. ఇంటర్మీడియేట్ కాపీ తమకు చేరిన తర్వాత ప్రభుత్వం అనుమతి తీసుకున్నతర్వాత ఎంసెట్ సిలబస్‌ను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇంటర్ టైమ్ టేబుల్ విడుదలైన తర్వాత ఎంసెట్ ఎంట్రెన్స్ షెడ్యూల్, జూన్ రెండో వారంలో ఎంసెట్ పరీక్ష నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా, కరోనా మహమ్మారి విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపడంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పాఠశాలల విద్యార్థులకు ఇప్పటికే పై తరగతులకు ప్రమోట్ చేసింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం.
తెలంగాణలోని ఆ ఊరంతా వనవాసానికి వెళ్లింది.. ఎక్కడ..? ఎందుకు..? పూర్తి వివరాలు తెలుసుకోండి..!