AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS EAMCET Counselling: తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ విడుదల.. పూర్తి వివరాలు

జూన్‌ 27వ తేదీ నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ మొదలవుతుండగా, జూన్ 30 నుంచి విద్యార్థులు మొదటి విడత వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం జులై 12వ తేదీన మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ఉండనుంది. ఇక ఈసారి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ మొత్తం మూడు విడతల్లో జరగనుంది...

TS EAMCET Counselling: తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ విడుదల.. పూర్తి వివరాలు
Ts Eamcet
Narender Vaitla
|

Updated on: May 24, 2024 | 4:06 PM

Share

తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎప్‌ ఎప్‌సెట్ ఫలితాలను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు కౌన్సెలింగ్ షెడ్యూల్ ఎప్పుడా అని చూస్తున్న తరుణంలో తెలంగాణ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. జూన్‌ 27వ తేదీ నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.

జూన్‌ 27వ తేదీ నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ మొదలవుతుండగా, జూన్ 30 నుంచి విద్యార్థులు మొదటి విడత వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం జులై 12వ తేదీన మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ఉండనుంది. ఇక ఈసారి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ మొత్తం మూడు విడతల్లో జరగనుంది. జులై 19 నుంచి ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇక రెండో విడత సీట్ల కేటాయింపు జులై 24వ తేదీన జరగనుంది. అలాగే తుది విడత కౌన్సెలింగ్‌ను జులై 30 వతేదీన నిర్వహించి, ఆగస్టు 5వ తేదీన చివరి విడత సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు.

ఇదిలా ఉంటే ఇంటర్నల్ స్లైడింగ్ ఆన్‌లైన్‌లో కన్వీనర్ ద్వారా చేపట్టాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 12 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. అలాగే ఆగస్టు 16న ఇంటర్నల్ స్లైడింగ్ సీట్ల కేటాయింపు ఉండనుంది. ఇక ఆగస్టు 17న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

కాగా ఈ ఏడాది జరిగిన పరీక్షల్లో ఇంజినీరింగ్ పరీక్షకు 2,54,814 మంది విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే. పరీక్షకు హాజరైన వారిలో మొత్తం 74.98 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. వీరిలో అబ్బాయిలు 74.38 శాతం, అమ్మాయిలు 75.85 శాతం మంది ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
జెండా లేని జెన్‌జీ.. లాఠీలకు లొంగని తెగింపు..
జెండా లేని జెన్‌జీ.. లాఠీలకు లొంగని తెగింపు..
మార్కెట్‌లోకి ఫోక్స్‌వ్యాగన్‌ వర్టస్‌ స్పెషల్ ఎడిషన్.. వివరాలివే
మార్కెట్‌లోకి ఫోక్స్‌వ్యాగన్‌ వర్టస్‌ స్పెషల్ ఎడిషన్.. వివరాలివే
ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష తింటే.. నిజంగా అంత మంచిదా?
ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష తింటే.. నిజంగా అంత మంచిదా?
ఇది మీకు తెలుసా.. సిమ్ కార్డ్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా..?
ఇది మీకు తెలుసా.. సిమ్ కార్డ్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా..?
రోజూ చెత్త వేస్తున్నా డస్ట్‌బిన్‌ నుంచి వాసన రాకుండా ఉండాలంటే?..
రోజూ చెత్త వేస్తున్నా డస్ట్‌బిన్‌ నుంచి వాసన రాకుండా ఉండాలంటే?..
మార్కెట్లో పెరిగిన 160cc బైక్స్ పోటీ.. టీవీఎస్‌ నిర్ణయమిదే
మార్కెట్లో పెరిగిన 160cc బైక్స్ పోటీ.. టీవీఎస్‌ నిర్ణయమిదే
మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రూ.9,800 పెరిగిన బంగారం ధర..
మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రూ.9,800 పెరిగిన బంగారం ధర..
వీళ్లు జామకాయలు అస్సలు తినకూడదు..చాలా డేంజర్! శరీరంలో జరిగేది ఇదే
వీళ్లు జామకాయలు అస్సలు తినకూడదు..చాలా డేంజర్! శరీరంలో జరిగేది ఇదే
మహారాష్ట్రలో బ్యాన్‌ చేసిన ఈ అనలాగ్ పనీర్‌ గురించి తెలుసా!
మహారాష్ట్రలో బ్యాన్‌ చేసిన ఈ అనలాగ్ పనీర్‌ గురించి తెలుసా!
బీఎండబ్ల్యూ నుంచి కొత్త బైక్‌.. మైలేజ్, ధర వివరాలు
బీఎండబ్ల్యూ నుంచి కొత్త బైక్‌.. మైలేజ్, ధర వివరాలు