AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆర్డర్ చేయకుండా పార్శిల్ వచ్చిందా.? ఇది తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే

ఈరోజుల్లో మంచి కోసం టెక్నాలజీని ఉపయోగించడం కంటే చెడు కోసం దానిని దుర్వినియోగం చేయడం అధికమైపోయింది...ఇప్పటి వరకు ఈ కామర్స్ పోర్టల్స్‌లో గ్రాసరీలు, బట్టలు, చెప్పులు, షూస్, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుక్కునేవాళ్ళం.. కాని వాటి ముసుగులో కొరియర్స్ ద్వారా డ్రగ్స్ కూడా డోర్ డెలివరీ అవుతున్నాయి.

Telangana: ఆర్డర్ చేయకుండా పార్శిల్ వచ్చిందా.? ఇది తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే
Online Parcel
Gopikrishna Meka
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 29, 2025 | 2:13 PM

Share

ఈరోజుల్లో మంచి కోసం టెక్నాలజీని ఉపయోగించడం కంటే చెడు కోసం దానిని దుర్వినియోగం చేయడం అధికమైపోయింది…ఇప్పటి వరకు ఈ కామర్స్ పోర్టల్స్‌లో గ్రాసరీలు, బట్టలు, చెప్పులు, షూస్, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుక్కునేవాళ్ళం.. కాని వాటి ముసుగులో కొరియర్స్ ద్వారా డ్రగ్స్ కూడా డోర్ డెలివరీ అవుతున్నాయి. ఖండాంతరాలు దాటి దేశంలోకి వస్తున్న డ్రగ్స్ నేరుగా మత్తు వినియోగదారులకు చేరడానికి ఈ కామర్స్ పోర్టల్స్ పేరుతో కొరియర్ సర్వీసులను వినియోగిస్తూ దందాలు నడిపిస్తున్నాయి నైజీరియన్ డ్రగ్ ముఠాలు.. ఢిల్లీలో తెలంగాణ ఈగల్ టీం, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో నైజీరియన్ డ్రగ్ ముఠా డ్రగ్ సరఫరా కోసం వస్తువులను కొరియర్ చేసే పేరుతో ఎలా డ్రగ్స్ దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నాయో వెలుగులోకివచ్చింది. తెలంగాణ‌లో ప్రభుత్వం డ‌గ్స్ పై ఉక్కుపాదం మోపుతోంది. ఇందుకోసం ప్ర‌త్యేకించి ఈగల్ టీమ్ ను ఏర్పాటు చేసింది. డ్ర‌గ్స్ ర‌హిత తెలంగాణ కోసం శ్ర‌మిస్తున్న ఈ టీమ్ గోవా ,ముంబై సహా అనేక రాష్ట్రాల్లో డ్ర‌గ్స్ నెట్ వర్క్స్ చేధించాయి..అయినా చాప కింద నీరులా విస్తరిస్తున్న డ్రగ్స్ తెలంగాణకు ఎక్క‌డి నుంచి స‌ర‌ఫ‌రా అవుతున్నదానిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ఢిల్లీ లింక్స్ ను గుర్తించింది.. అందులో భాగంగా రెండు నెలల పాటు శ్రమించి ఢిల్లీ నుంచి హైద‌రాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్ డ్రగ్ ముఠా గుట్టు రట్టు చేసింది ఈగల్ టీమ్..ఒక్క తెలంగాణకే కాక దేశంలో ఇతర రాష్ట్రాలకు కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్న కేటుగాళ్లను పట్టుకుంది.

ఈ కామర్స్ పోర్టల్స్ పేరుతో కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా

డ‌గ్స్ మాఫియా రూటు మార్చింది. ఎవ్వ‌రీకి అనుమానం క‌లుగ‌కుండా స‌రికొత్త‌గా ప్లాన్ వేశారు. టెక్నాలజీని ఉపయోగించుకుని దేశ రాజ‌ధాని ఢిల్లీ నుంచి డ్ర‌గ్స్ ను వివిధ ప్రాంతాల‌కు చేర‌వేస్తున్నారు. ఇందుకోసం ప్రముఖ కొరియర్, పార్శిల్స్ సర్వీసులతోనే ఈ వ్యవహారాన్ని న‌డిపిస్తున్నారు. ముఖ్యంగా గార్మెంట్స్, కాస్మోటిక్స్, షూల మధ్యలో ఉంచి డ్రగ్స్ ను వినియోగదారులకు అందజేస్తున్నారు.. హైదరాబాద్ లో ఓ రెస్టారెంట్ యాజ‌మాని డ్ర‌గ్ అడిక్ట‌ర్‌, అత‌ను డ్ర‌గ్స్‌ను కొనుగోలు చేసుకోని చేసుకోని, అత‌ని స్నేహితుల‌కు సైతం మాద‌క‌ద్ర‌వ్యాల‌ను అంద‌జేశాడు. ఇదే విషయం ఈగ‌ల్ టీమ్ కి తెలియడంతో అత‌న్ని విచారించ‌గా తీగ‌లాగితే ఢొంకా క‌దిలింది అన్న చందంగా అస్స‌లు బండారం బ‌య‌ట‌ప‌డింది. దీంతోనే దేశ రాజధానిలో తెలంగాణ ఈగల్ టీమ్ బిగ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టి స‌క్సెస్ అయ్యింది. ఈ ఆపరేషన్లో కీలక ఆధారాలను సేకరించింది. పెద్ద ఎత్తున నడుస్తున్న డ్రగ్స్ దందాను గుర్తించింది. రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ స్వాధీనం చేసుకుంది.

మెగా ఆపరేషన్

న్యూఢిల్లీలో తెలంగాణ ఈగల్ టీమ్, ఎన్‌సీబీ, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌ జరిపి నైజీరియన్ డ్రగ్ ముఠా ను పట్టుకున్నారు.. ఈ సందర్భంగా సంచ‌ల‌న విషయాలు వెలుగులోకి వచ్చాాయి. హైదరాబాద్ లో నమోదైన కేసుల ఆధారంగా ఢిల్లీలో 18 ప్రాంతాలతో పాటు నోయిడా, గ్వాలియర్, విశాఖలో తనిఖీలు నిర్వహించారు. ఒక్క ఢిల్లీలోనే 16 విక్రయ కేంద్రాలను గుర్తించారు.. యాభై మంది నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు.. వీళ్లలో వీసా గడువు ముగిసి భారత్ లో ఉంటున్న 40 మంది డిపోర్ట్ చేయనున్నారు..మరో 10 మందిని అరెస్ట్ చేశారు.. నైజీరియాకు చెందిన నిక్కీ ఆధ్వర్యంలో ఈ డ‌గ్ర్ దందా జరుగుతుంది.. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకున్న ఈ మాఫియా వివిధ ప్రాంతాల‌కు డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు.. ఒక్క తెలంగాణ‌లోని 1975 మందికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.. అది కూడా ఢిల్లీ నుంచి కొరియర్ పార్శిల్ ద్వారా.. బూట్లు, దుస్తులు, కాస్మోటిక్ వస్తువులు, చెప్పులు మధ్యలో డ్రగ్స్ పెట్టి కొరియర్ ద్వారా సప్లై చేస్తున్నారు.. ఇందులో శ్రీ మారుతి కొరియర్స్, డీటీడీసీ, ప్రొఫెషనల్ కొరియర్స్, షిప్‌ రాకెట్, ఇండియా పోస్ట్, ఢిల్లీ వేరీ, బ్లూ డార్ట్, ట్రాక్‌ ఆన్ తదితర కొరియర్స్‌ నెట్‌వర్క్‌ను ఈ నైజీరియన్ ముఠా ఉపయోగించింది.

చదువుకోసం వచ్చి డ్రగ్స్ దందాలు

ప్ర‌ధానంగా ఎడ్యుకేషన్ వీసాపై ఇండియాకు వచ్చిన నైజీరియన్లు కొందరు చదువు మానేసి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు..చదువుకోసం వచ్చిన విద్యార్థుల లోకల్ బ్యాంకు ఎకౌంట్ల‌ను ఈ డ్ర‌గ్ మాఫియా ఆప‌రేట్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.. న్యూఢిల్లీలోని 18 ప్రాంతాల్లో జరిగిన సోదాల్లో వీసా గడువు ముగిసిన 40 మందికిపైగా నైజీరియన్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. తెలంగాణలో డ్రగ్స్ కేసులతో సంబంధం ఉన్న 11 మందిని ఢిల్లీ,నోయిడా, గ్వాలియర్, విశాఖపట్నం తదితర నగరాల్లో అరెస్ట్ చేసి విచారణ కోసం హైదరాబాద్ తరలిస్తున్నారు..

ఢిల్లీలో భారీగా డ్రగ్స్ స్వాధీనం

ఢిల్లీలో తెలంగాణ ఈగల్ టీమ్ ఢిల్లీ పోలీసులు జరిపిన ఆపరేషన్లో నిందితుల నుంచి రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ స్వాధీనం చేసుకున్నారు… ఇందులో నాలుగు ప్రాంతాల్లో 5,340 ఎక్స్ సిటీ మాత్రలు, 250 గ్రాముల కొకైన్, 109 గ్రాముల హెరాయిన్, 250 గ్రాముల మెథాంఫెటమైన్‌ను సీజ్ చేసారు.. ఢిల్లీలోని 59 మ్యూల్ ఖాతాలతోపాటు 16 డ్రగ్స్ కేంద్రాలను గుర్తించారు… ఇక నైజీరియన్లకు చెందిన 107 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు …గ్రేటర్ నోయిడాలో డ్రగ్స్ ఆర్థిక వ్యవహారాలు చూసే బద్రుదీన్ అనే కీలక వ్యక్తిని అతని భార్యను అరెస్ట్ చేశారు ..

డ్రగ్స్ ఆపరేషన్ లో పాల్గొన్న 180 మంది పోలీసులు

తెలంగాణ ఈగల్ టీమ్, ఎన్‌సీబీ, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్ తెలంగాణ నుంచి ఆరుగ‌రు డిఎస్పీలు, ఆరుగురు ఇన్స్పెక్టర్లు, ఇతర 93 మంది సిబ్బంది క‌లిపి 105 మంది పాల్గొన్నారు.. కైమ్ బ్రాంచ్ నుంచి ఇద్ద‌రు ఎసీపీలు, ఐదుగురు ఇన్‌స్పెక్టర్లు, ప‌ది మంది ఎస్సైలు, ప‌దిహేను మంది ఏఎస్సైలు, 25 మంది హెడ్ కానిస్టేబుళ్లు ఇత‌రులు 18మందితో క‌లిసి మరో 75 మంది మొత్తం తెలంగాణ నుంచి 180 మంది పోలీసులు పాల్గొన్నారు.. ఈ సంద‌ర్భంగా ఈ ఆప‌రేష‌న్‌కు స‌హ‌క‌రించిన ఢిల్లీ జాయింట్ సీపీతోపాటుగా క్రైం బ్రాంచ్ పోలీసులకు ఎస్పీ సీతారామ్ అభినంద‌న‌లు… డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం తెలంగాణ ఈగల్ టీమ్ నిరంతరం పనిచేస్తుందని స్పష్టం చేశారు.