Telangana: ‘నా భర్తను వెంటనే అరెస్ట్‌ చేయండి’.. వైద్య వృత్తి మాటున అసభ్య కార్యకలాపాలకు పాల్పడుతోన్న మాయగాడు!

| Edited By: Srilakshmi C

Jan 19, 2024 | 6:28 PM

పవిత్రమైన వైద్య వృత్తిలో కొనసాగుతూ అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఓ వైద్యుడి బండారం బట్టబయలైంది. యువకులను మాయ మాటలతో లోబర్చుకుని హోమో సెక్స్ కు పాల్పడుతున్న వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్వయంగా సదరు వైద్యుడి భార్య ఫిర్యాదు చేయడం గమనార్హం. సొంత రాష్ట్ర నుంచి పరారైన అతగాడు ప్రస్తుతం వేరే రాష్ట్రంలో మకాం మార్చాడు. అతని ఆగడాలకు ఇప్పటికే ఓ విద్యార్ధి ఆత్మహత్య..

Telangana: నా భర్తను వెంటనే అరెస్ట్‌ చేయండి.. వైద్య వృత్తి మాటున అసభ్య కార్యకలాపాలకు పాల్పడుతోన్న మాయగాడు!
Telangana Crime
Follow us on

హైదరాబాద్, జనవరి 19: పవిత్రమైన వైద్య వృత్తిలో కొనసాగుతూ అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఓ వైద్యుడి బండారం బట్టబయలైంది. యువకులను మాయ మాటలతో లోబర్చుకుని హోమో సెక్స్ కు పాల్పడుతున్న వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్వయంగా సదరు వైద్యుడి భార్య ఫిర్యాదు చేయడం గమనార్హం. సొంత రాష్ట్ర నుంచి పరారైన అతగాడు ప్రస్తుతం వేరే రాష్ట్రంలో మకాం మార్చాడు. అతని ఆగడాలకు ఇప్పటికే ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. అతని బారీ నుంచి యువకులను కాపాడాలంటూ వైద్యుడి భార్య ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. నిందితుడిని తెలంగాణలోని మౌలాలికి చెందిన డాక్టర్ జవ్వాద్ అలి ఖాజాగా పేర్కొంది. వైద్యుని భార్య అంజుమ్ బేగం తెల్పిన వివరాల ప్రకారం..

మౌలాలికి చెందిన డాక్టర్ జవ్వాద్ అలి ఖాజాతో అంజుమ్ బేగంకు 2014లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరూ పిల్లలు ఉన్నారు. వివాహ సమయంలో తమ తల్లిదండ్రులు జవ్వాద్‌కు కట్నకానుకల కింద రూ. 25 లక్షల నగదు, 30 తులాల బంగారం ఇచ్చారు. అయినప్పటికీ పుట్టింటి నుంచి అధిక కట్నం తీసుకురావాలని జవ్వాద్‌ అలీ నిత్యం ఆమెను వేదింపులకు గురిచేయసాగాడు. అయినప్పటికి తన వైవాహిక జీవితం, పిల్లల భవిష్యత్తు కోసం అన్ని వేదింపులు భరించింది. ఈ క్రమంలో 2023 ఫిబ్రవరి 20న వైద్యుడు జవ్వాద్‌ ఇంట్లో సీసీ కెమెరాలను ఆపివేసి ఎక్కడికో పారిపోయాడు. ఈ విషయం తెలియని ఇంటిపై అంతస్తులో అద్దెకు ఉంటున్న విష్ణువర్ధన్ రెడ్డి అనే విద్యార్థి జవ్వాద్‌ గురించి ఆరా తీశాడు. అనంతరం ఒక గంట తరువాత ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతేకాకుండా అతని గదిలో సుసైడ్ లేఖలో జావ్వాద్ తనని లైంగికంగా వేధింపులకు గురి చేసినట్లు పేర్కొన్నాడు. దీనిపై కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అయితే జవ్వాద్ తనకు ఉన్న పరిచయాలతో పోలీసులతో కుమ్ముక్కై పరారయ్యాడని అతని భార్య అంజుమ్ బేగం ఆరోపించింది. తెలంగాణ నుంచి పారిపోయి ప్రస్తుతం హర్యానాలో డాక్టర్ వృత్తి నిర్వహిస్తూ… అక్కడ కూడా వైద్యం పేరుతో యువకులను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని తెల్పింది. వైద్య వృత్తిలో ఉంటూ యువకులను లక్ష్యంగా చేసుకుని హోమో సెక్స్ కు పాల్పడుతున్న జవ్వాద్‌పై ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించి తనకు, తన ఇద్దరు పిల్లలకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.