Telangana Rains: నేటి నుంచి మూడు రోజుల పాటు విద్యా సంస్థలు మూసివేత
Telangana Rains: తెలంగాణలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా జోరుగా కురుస్తోంది. ఆకాశానికి చిల్లులు పడినట్లుగా వరుణులు విజృంభిస్తున్నాడు. వాగులు..
Telangana Rains: తెలంగాణలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా జోరుగా కురుస్తోంది. ఆకాశానికి చిల్లులు పడినట్లుగా వరుణులు విజృంభిస్తున్నాడు. వాగులు, వంకలు పూర్తిగా నిండిపోయి పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు సైతం నిండిపోవడంతో గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. ఇక ఈ రోజు, రేపు భారీ వర్షాలు ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యాసంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. సోమ, మంగళ, బుధవారాలలో విద్యాసంస్థలన్నీ మూసివేయాలని ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశాలున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు నిన్న సాయంత్రం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి అధికారులకు ఈ ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిచాలని సూచించారు.
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు..
రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలు పొంగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, ప్రయాణాలు తగ్గించుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ముంపు పరిస్థితులపై సీఎం ఆరా తీశారు. సెక్రటేరియట్ లో కంట్రోల్ రూంను ఏర్పాటుచేసి, ప్రతి ఆరు గంటలకొకసారి జిల్లా కలెక్టర్లతో, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి ఫోన్ నంబర్లను ప్రజలకు చేరవేసేలా ప్రచారం చేయాలన్నారు. ఏటూరు నాగారం, రామన్న గూడెం ప్రాంతాల వరద ముంపు అధికంగా ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో నేడు, రేపు, ఎల్లుండి భారీ వర్షాలున్నాయనే హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తం కావాలని సీఎం అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి