సైబర్ నెరగాల బారిన పడి అనేక మంది బాధితులు లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. తమ ఫోన్లకు వస్తున్న లింకులు క్లిక్ చేయడం ద్వారా తమకు తెలియకుండానే తమ ఖాతాల్లో నుండి డబ్బు మాయమవుతుంది. ప్రతిరోజు దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలు అంతకింతకు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో నేరస్తులను పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. దీంతో దేశవ్యాప్తంగా ఒకే టోల్ ఫ్రీ నెంబర్ కేంద్రం అమలు చేస్తుంది.1930 టోల్ ఫ్రీ నంబర్ కు సైబర్ బాధితులు ఫిర్యాదు చేయవచ్చు. డబ్బు పోగొట్టుకున్న గంటల వ్యవధిలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే, నిందితుడి ఖాతాలోకి వెళ్లిన డబ్బును బ్యాంక్ అధికారులతో కలిసి పోలీసులు ఫ్రీజ్ చేయిస్తున్నారు. ఇలా ఫ్రీజ్ చేయించిన డబ్బును లోక్ అదాలత్ ద్వారా బాధితులకు అందజేస్తున్నారు.
హైదరాబాదులో నిర్వహించిన లోక్ అదాలత్ లో దాదాపు 4,000 మంది సైబర్ బాధితులకు డబ్బును అందజేశారు. గత ఏడాది 15 లక్షలు పోగొట్టుకున్న నిజామాబాద్ వాసికి ఆరు లక్షల రూపాయల రీఫండ్ అందించారు. లోక్ అదాలత్ ద్వారా రిఫండ్ చేస్తున్న రాష్ట్రాల్లో మొదటి రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సృష్టించింది. తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ విధానాన్ని మిగతా రాష్ట్రాలకు కూడా ఫాలో అవుతున్నాయి. బ్యాంక్ అధికారులతో సమన్వయం చేసుకొని తెలంగాణ పోలీసులు లోక్ అదాలత్ సందర్భాల్లో సైబర్ బాధితులను ఆదుకుంటున్నారు. మరో ఘటనలో కరీంనగర్ కు చెందిన ఒక యువతి 17 లక్షల రూపాయలు సైబర్ బారిన పడి పోగొట్టుకుంది. లోక్ అదాలత్ ద్వారా సదరు యువతికి 7.4 లక్షల రిఫండ్ అందించారు పోలీసులు.
లోక్ అదాలత్‌లో రెండు రకాలుగా సైబర్ క్రైమ్ కేసులను విభజించారు పోలీసులు. డబ్బు పోగొట్టుకున్న వెంటనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే వెంటనే ఎఫ్ ఐ ఆర్ నమోదు అవుతుంది. దర్యాప్తులో భాగంగా ఏ ఖాతాకు డబ్బులు వెళ్ళాయో ఆ అకౌంట్ ని పోలీసులు ఫ్రీజ్ చేయిస్తారు. ఎఫ్ ఐ ఆర్ అయిన మూడు నెలల్లో లోక్ అదాలత్ కి కేసు వస్తుంది. కోర్టు నుండి వచ్చిన రిఫండ్ ఆర్డర్ ను బ్యాంక్ అధికారులకు పోలీసులు పంపిస్తారు. బ్యాంకు నుండి నేరుగా బాధితుల ఖాతాకి డబ్బు జమవుతుంది.
ఇక ఇప్పటివరకు మూడు సందర్భాల్లో లోక్ అదాలత్ ద్వారా అనేకమంది బాధితులకు న్యాయం జరిగింది. ఫిబ్రవరి 2 నుండి జూన్ 7 వరకు 5142 మంది బాధితులకు 31.2 కోట్ల రూపాయల రిఫండ్ వచ్చింది. ఒక జూన్ 8వ తేదీన 2,973 మంది బాధితులకు 7.9 కోట్ల రూపాయల రిఫండ్ వచ్చింది. మార్చి 18న నిర్వహించిన లోక్ పదాలతో 803 బాధితులకు 3.6 కోట్ల రూపాయల రిఫండ్ వచ్చింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…