Crime News: మంచిర్యాల మున్సిపల్‌ కమిషనర్‌ భార్య ఆత్మహత్య.. ‘రెండో పెళ్లి కోసమేనా..?’

|

Feb 08, 2023 | 8:49 AM

మంచిర్యాల జిల్లా కేంద్ర మున్సిపల్‌ కమిషనర్ నల్లమల్ల బాలకృష్ణ భార్య జ్యోతి (32) మంగళవారం (ఫిబ్రవరి 7) ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాల వల్ల ఈ దారుణం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది..

Crime News: మంచిర్యాల మున్సిపల్‌ కమిషనర్‌ భార్య ఆత్మహత్య.. రెండో పెళ్లి కోసమేనా..?
Mancherial Crime News
Follow us on

మంచిర్యాల జిల్లా కేంద్ర మున్సిపల్‌ కమిషనర్ నల్లమల్ల బాలకృష్ణ భార్య జ్యోతి (32) మంగళవారం (ఫిబ్రవరి 7) ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాల వల్ల ఈ దారుణం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవపురానికి చెందిన నల్లమల్ల బాలకృష్ణ, కొణిజర్ల మండలం సీతారామపురానికి చెందిన జ్యోతితో 2014, ఆగస్టు 14న వివాహమైంది. ఈ దంపతులకు రిత్విక్‌ (8), భవిష్య (6) పిల్లలు ఉన్నారు. బాలకృష్ణ తొలుత కానిస్టేబుల్‌గా హైదరాబాద్‌లో ఉద్యోగం చేసేవాడు. ఆ తర్వాత సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి నిర్మల్ మున్సిపల్ కమిషనర్‌గా, ఆ తర్వాత మంచిర్యాలకు గ్రేడ్ వన్ కమిషనర్‌గా పదోన్నతి పొందారు. ఈ క్రమంలో ఏడాదిన్నర క్రితం నిర్మల్‌ నుంచి మంచిర్యాలకు బదిలీ అయ్యారు. మంచిర్యాలలోని మేదరివాడలో ఆదిత్య ఎంక్లేవ్‌లో బాలకృష్ణ, ఆయన భార్య జ్యోతి నివాసం ఉంటున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతుల మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు చోటుచేసుకుంటున్నాయి. ఉన్నట్టుండి జ్యోతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది.

బాలకృష్ణతో పాటు అతడి కుటుంబసభ్యుల వేధింపులతోనే తమ కుమార్తె బలవన్మరణానికి పాల్పడినట్లు జ్యోతి తల్లిదండ్రులు గంగవరపు రవీంద్రకుమారి, రాంబాబులు ఆరోపించారు. మంగళవారం ఉదయం 9 గంటల 30 నిముషాలకు ఫోన్‌ చేసి తన భర్త చంపేలా ఉన్నారని చెప్పినట్లు వారు పోలీసులకు తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌గా ఎంపికైన తర్వాతినుంచి వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కోట్ల రూపాయల కట్నంతో పాటు అందమైన భార్య వస్తుందని పదేపదే వేధించేవారని, అల్లుడు బాలకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని జ్యోతి తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు జ్యోతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జ్యోతి, బాలకృష్ణల సెల్‌ఫోన్లను సీజ్‌ చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.