Telangana Politics: నా రూటే సపరేట్ అంటున్న కోమటిరెడ్డి.. పార్టీలో చర్చనీయాంశంగా మారిన వెంకట్ రెడ్డి తీరు..

| Edited By: Shiva Prajapati

Feb 13, 2022 | 1:46 PM

Telangana Politics: కాంగ్రెస్ పార్టీ.. టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమలు చేస్తుంది. ఎంత చేసినా బీజేపీ టీఆర్ఎస్ మాత్రమే ఎప్పుడు పోటా పోటీగా విమర్శలు,

Telangana Politics: నా రూటే సపరేట్ అంటున్న కోమటిరెడ్డి.. పార్టీలో చర్చనీయాంశంగా మారిన వెంకట్ రెడ్డి తీరు..
Komatireddy
Follow us on

Telangana Politics: కాంగ్రెస్ పార్టీ.. టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమలు చేస్తుంది. ఎంత చేసినా బీజేపీ టీఆర్ఎస్ మాత్రమే ఎప్పుడు పోటా పోటీగా విమర్శలు, కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫోకస్ అవ్వడానికి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలి? ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి? అని కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నం చేస్తుంది. కానీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు చర్యల వల్ల పార్టీలో విపరీత మైన చర్చ నడుస్తోంది. జిల్లా స్థాయి నాయకత్వం అయితే అసలు పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాక తికమక పడుతున్నారట.

కాంగ్రెస్ సీనియర్ నేత.. అధికార పార్టీ టీఆర్ఎస్ పై పోరాటం చేయాల్సిన నేత.. ఏకంగా సీఎం కేసీఆర్ ను పోగడ్తలతో ముంచేత్తడం అందరినీ నివ్వెర పోయేలా చేస్తోంది. జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటనలో.. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గోన్నారు. రెండు రోజుల పాటు కేసీఆర్‌తో కలిసి తిరగడమే కాదు.. ఉమ్మడి నల్లగొండ టీఆర్ఎస్ నేతలను ఆశ్చర్యానికి లోనయ్యేలా చేశారు. ఒక వైపు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించారు. ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల డిమాండ్ ఒకటైతే.. రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన కామెంట్స్‌ను వ్యతిరేకిస్తూ సీఎం పర్యటనను అడ్డుకుంటామని డీసీసీ అధ్యక్షుడు ప్రకటించారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం అదేమీ పట్టనట్లు.. ఆ ప్రకటన చేసింది తమ పార్టీ నేత కాదన్నట్లు కేసీఆర్ వెంట తిరిగారు.

ఇక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కలెక్టరేట్‌ల ప్రారంభోత్సవంలో కేసీఆర్‌తో చాలా చనువుగా వున్నారు. టీఆర్ఎస్ నేతల కంటే ఎక్కువగా కేసీఆర్‌తో ముచ్చటించారు. అంతేకాదు గులాబీ అధినేత కేసీఆర్‌ను సభావేదికపై నుండే పోగడ్తలతో ముంచేత్తారు. జిల్లా మంత్రులు, సొంతపార్టీ ఎమ్మెల్యేల కంటే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడిన తీరు అక్కడ ఉన్న వారందరినీ ముక్కున వేలేసుకునెలా చేసింది. ఇప్పుడు ఇదే హాస్తం పార్టీలో తీవ్ర చర్చనీయంగా మారింది.

కొన్ని రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటనలో కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో సైతం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జిల్లా టీఆర్ఎస్ నేతల కంటే ఎక్కువగా మంత్రితో చనువుగా ఉన్నారు. కేటీఆర్ తో పది నిమిషాలు పర్సనల్ గా మాట్లాడారు కుడా. దీంతో అక్కడ వున్న వాళ్లంతా ఆశ్చర్యపడ్డారు. మెన్న కేటీఆర్‌తో భుజం భుజం రాసుకు తిరిగిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఆ వెంటనే సీఎం కేసీఆర్‌తో కూడా అదే తీరుతో మెలగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవి కోసం సీరియస్‌గా ట్రై చేసిన విషయం తెలిసిందే. అలాంటి వ్యక్తి చర్యలు ఇప్పుడు పార్టీలో చర్చకు దారి తీసేలా చేస్తున్నాయి. పార్టీ లైన్‌లో కాకుండా సొంత ఎజెండాతో ఎందుకు వెళ్తున్నారు అనేది అర్థం కాక కాంగ్రెస్ క్యాడర్ అంతా అయోమయంలో పడిపోయింది.

Also read:

Sampoornesh Babu: మరోసారి మంచి మనసు చాటుకున్న సంపూర్ణేశ్‌ బాబు.. గుండె జబ్బుతో బాధపడుతోన్న రెండు నెలల చిన్నారికి.

Sun Worship: సూర్యుడి అనుగ్రహం కోసం ఆదివారం ఉపవాసం బెస్ట్‌.. అన్ని పనులు సకాలంలో పూర్తి..?

Ram Nath Kovind Hyderabad Live: నేడు శ్రీరామనగరానికి రాష్ట్రపతి.. సమతామూర్తిని సందర్శించనున్న కోవింద్