AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో నేటి నుంచి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ.. ఇవి తప్పనిసరి

ఒక్క దరఖాస్తులోనే ఆరు గ్యారంటీలకు సంబంధించిన కాలమ్‌లు ఉండేలా ప్లాన్ చేసింది. అందరికీ సులభంగా అర్థమయ్యేలా ఈ దరఖాస్తును రూపొందించారు. మహాలక్ష్మీ పథకంలో ప్రతి నెల రూ. 2500 ఆర్థిక సహాయం అనే కాలమ్ ఉంది. ఈ పథకం కావాలనుకునే వారు.. పక్కన ఉన్న బాక్స్‌లో టిక్ చేస్తే సరిపోతుంది. ఇక అందులోనూ రూ. 500లకు గ్యాస్ సిలిండర్ ఆప్షన్ ఉంది. ఈ పథకం పొందాలనుకునే వాళ్లు ఇక్కడి టిక్ చేయడంతో..

Telangana: తెలంగాణలో నేటి నుంచి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ.. ఇవి తప్పనిసరి
Praja Palana
Subhash Goud
| Edited By: |

Updated on: Dec 28, 2023 | 12:58 PM

Share

6 గ్యాంటీల అమలులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా డిసెంబర్‌ 28వ తేదీ నుంచి జనవరి 6 వరకు సంక్షేమ పథకాల దరఖాస్తులను స్వీకరించబోతుంది ప్రభుత్వం. గ్యారెంటీల్లో 2 హామీలను ఇప్పటికే అమలుచేశామని చెప్తున్న సర్కారు.. మిగిలిన వాటి కోసం అప్లికేషన్స్ స్వీకరిస్తున్నామని చెప్తోంది. అభయహస్తం దరఖాస్తు పత్రాలు, లోగోను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌.. నిస్సహాయులకు సాయం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని సవ్యంగా అమలుచేసేందుకు సీనియర్‌ IAS అధికారులను జిల్లాలకు నోడల్‌ ఆఫీసర్లుగా నియమించింది ప్రభుత్వం. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 6 జోన్లలో ప్రజాపాలన అమలు కోసం IAS అధికారులను నియమించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 600 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే 30 సర్కిల్స్‌లో 30 మంది స్పెషల్ ఆఫీసర్స్, 10 వేల మందికిపైగా సిబ్బంది విధుల్లో పాల్గొనున్నారు.

ఒక్క దరఖాస్తులోనే ఆరు గ్యారంటీలకు సంబంధించిన కాలమ్‌లు ఉండేలా ప్లాన్ చేసింది. అందరికీ సులభంగా అర్థమయ్యేలా ఈ దరఖాస్తును రూపొందించారు. మహాలక్ష్మీ పథకంలో ప్రతి నెల రూ. 2500 ఆర్థిక సహాయం అనే కాలమ్ ఉంది. ఈ పథకం కావాలనుకునే వారు.. పక్కన ఉన్న బాక్స్‌లో టిక్ చేస్తే సరిపోతుంది. ఇక అందులోనూ రూ. 500లకు గ్యాస్ సిలిండర్ ఆప్షన్ ఉంది. ఈ పథకం పొందాలనుకునే వాళ్లు ఇక్కడి టిక్ చేయడంతోపాటు గ్యాస్ కనెక్షన్ నంబర్, సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్యను నమోదు చేయాల్సి ఉంటుంది.

ఇందులో భాగంగా రైతు భరోసా పథకం పొందాలనుకునే వాళ్లు ఇందులో పలు కాలమ్‌లను టిక్ చేయాల్సి ఉంటుంది. ఇందులో రైతు, కౌలు రైతు, పట్టాదారు పాసు పుస్తకం నంబర్లు, సాగు చేస్తున్న భూమి వివరాలు నమోదు చేయాలి. ఇక ఏటా రూ. 12000 కావాలనుకునే వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ కార్డు నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇందిరమ్మ ఇండ్ల పథకం కావాలనుకునే వారు కూడా ఇదే దరఖాస్తులోనే వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో అమరవీరులు, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలానికి సంబంధించిన కాలమ్ కూడా ఉంది. అయితే అమరవీరులు, ఉద్యమకారులకు సంబంధించిన వివరాలు ఇందులో నమోదు చేయాలి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వివరాలు కూడా ఇందులో పొందుపర్చాల్సి ఉంటుంది. ఇక మరో పథకంగృహజ్యోతి పథకం కింది నెలకు ఉచిత విద్యుత్ కావాలనుకునే వాళ్లు ఇందులో ఉన్న కాలమ్‌లో వివరాలు నమోదు చేయాలి. వారి గృహ వినియోగ విద్యుత్ మీటర్‌ కనెక్షన్ సంఖ్యను తెలిపాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి