Bhatti Vikramarka : సైకిలెక్కిన భట్టి, ఐదు రోజుల పాటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా యాత్ర, ధరల పెరుగుదలపై పోరుబాట

|

Mar 07, 2021 | 12:46 PM

Bhatti Vikramarka : తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సైకిల్‌ ఎక్కారు. ఆశ్చర్యపోకండి... ఆయనేం పార్టీ మారలేదు. పెరుగుతున్న డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలకు నిరసనగా సైకిల్‌ఎక్కి యాత్ర చేపట్టారు...

Bhatti Vikramarka : సైకిలెక్కిన భట్టి, ఐదు రోజుల పాటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా యాత్ర, ధరల పెరుగుదలపై పోరుబాట
Follow us on

Bhatti Vikramarka : తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సైకిల్‌ ఎక్కారు. ఆశ్చర్యపోకండి… ఆయనేం పార్టీ మారలేదు. పెరుగుతున్న డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలకు నిరసనగా సైకిల్‌ఎక్కి యాత్ర చేపట్టారు. భద్రాచలంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భట్టి తన సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఐదు రోజుల పాటు ఈ యాత్ర ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధాన వల్లే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఈ సందర్బంగా ఆరోపించారు భట్టి విక్రమార్క. ఈ పెరుగదలతో నిత్యవసరాల ధరలు కూడా పెరిగిపోయి సామాన్యులు బతలేని పరిస్థితి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, ఇవాళ్టి నుంచి ప్రారంభమైన సైకిల్ యాత్ర మార్చి 12 వరకు కొనసాగుతుంది. ఖమ్మం పట్టణంలో ఎన్నికల కోడ్ ముగిసేనాటికి సైకిల్ యాత్ర ముగుస్తుంది. మొత్తంగా 213 కిలోమీటర్లు భట్టి సైకిల్ యాత్ర జరగనుంది. 2023 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను జనం బండకేసి కొడతారన్నారని వ్యాఖ్యానించిన భట్టి.. ఖమ్మం జిల్లాలో సైకిల్ యాత్ర ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. వచ్చే మూడేళ్లు ప్రజల్లోనే ఉండాలని ఆయన గట్టిగా ఉన్నారాయన.

Read also : Asaduddin Owaisi : జగన్ కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వార్నింగ్.. ఏపీ రాజకీయాల్లో కొత్త కలకలం