AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: మా సీట్లు మాకు కావాలి.. తెలంగాణ కాంగ్రెస్‌లో తెగని సీట్ల పంచాయితీ.. హైకమాండ్ ఏం తేల్చనుంది..?

ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల వార్‌ తీవ్రమైంది. ఇప్పుడు.. బీసీ పంచాయితీ తెరపైకి వచ్చింది. మా వాటా మాకియ్యాలె అంటూ కాంగ్రెస్ పార్టీలో యుద్ధం ప్రకటించారు బీసీ నేతలు. అందులో భాగంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు ఢిల్లీకి పయనమయ్యారు. ఇవాళ అగ్రనేతలతో భేటీకానున్నారు.

Telangana Congress: మా సీట్లు మాకు కావాలి.. తెలంగాణ కాంగ్రెస్‌లో తెగని సీట్ల పంచాయితీ.. హైకమాండ్ ఏం తేల్చనుంది..?
Telangana Congress Party
Shaik Madar Saheb
|

Updated on: Sep 27, 2023 | 8:37 AM

Share

ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల వార్‌ తీవ్రమైంది. ఇప్పుడు.. బీసీ పంచాయితీ తెరపైకి వచ్చింది. మా వాటా మాకియ్యాలె అంటూ కాంగ్రెస్ పార్టీలో యుద్ధం ప్రకటించారు బీసీ నేతలు. అందులో భాగంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు ఢిల్లీకి పయనమయ్యారు. ఇవాళ అగ్రనేతలతో భేటీకానున్నారు. రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ నేతలతో బీసీ స్థానాలపై చర్చించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 48 సీట్లను బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల పీఈసీలో తీర్మానం చేసిన 34 సీట్లను 48కి పెంచాలని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలపునకు ఇవి కీలకంగా మారబోతాయని వివరించనున్నారు. ఇక ఇదే అంశంపై నిన్న హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో బీసీ నేతలు AICC ఇంచార్జ్‌ మానిక్‌రావ్‌ ఠాక్రేతో పాటు రేవంత్‌రెడ్డిని కలిసారు ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్ యాదవ్, ఉపాధ్యక్షులు గాలి అనిల్, సంగిశెట్టి జగదీష్. టీపీసీసీ బీసీ నేతలు. బీసీ నేతలకు సహకరించాలని వినతి పత్రాలు ఇచ్చారు.

అయితే ఇప్పటికే కొంతమంది ఓబీసీ నేతలు ఢిల్లీ చేరుకున్నారు. తెలంగాణలో గత పదేళ్లుగా అధికారంలో లేనప్పటికీ పార్టీకి విధేయులుగా ఉంటూ.. కేసులు ఎదుర్కొంటూ.. కష్టనష్టాల్లోనూ పార్టీని నమ్ముకుని ఉన్నామని చెప్పారు ఓబీసీ నేతలు. అలాంటి ఓబీసీ నేతలకు ఎమ్మెల్యే టికెట్లలో తగిన వాటా దక్కాల్సిందేనని తెలంగాణ కాంగ్రెస్ ఓబీసీ నేతలు స్పష్టం చేశారు. అధిష్టానాన్ని కలిసి తమ గోడు వినిపించేందుకు టీపీసీసీ అధికార ప్రతినిధి ప్రొ. కే. వెంకటస్వామి ఢిల్లీ వచ్చారు. పార్టీ కోసం కష్టపడ్డవారిలో ఓబీసీలదే సింహభాగమని, తమతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలూ ఉన్నారని తెలిపారు. ఇతర పార్టీల నేతలు పార్టీ గ్రాఫ్ పెరగగానే పరుగెత్తుకుంటూ దగ్గరకు వస్తున్నారని వెంకటస్వామి అన్నారు. పార్టీ కోసం పోరాడిన బీసీలను పక్కనపెట్టే దుష్టపన్నాగాన్ని మాత్రం తాము ఒప్పుకోబోమని అన్నారు.

తమ విజ్ఞప్తులను రాష్ట్ర నాయకత్వం గ్రహిస్తుందని నమ్మకం ఉన్నప్పటికి.. ఎక్కడో అభద్రతా భావంతోనే ఢిల్లీకి రావడం జరిగిందన్నారు వెంకటస్వామి. ఇవాళ కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు మహేశ్ కుమార్ గౌడ్, వీ. హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కి గౌడ్, సురేశ్ షెట్కార్, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు ఓబీసీ నేతల బృందం ఢిల్లీ రానుందని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..