Collectors Conference: కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్‌లు, పోలీస్ సూపరింటెండెంట్‌లు, కమిషనరేట్‌లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ తోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం కలెక్టర్ల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

Follow us

|

Updated on: Jul 16, 2024 | 12:16 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్‌లు, పోలీస్ సూపరింటెండెంట్‌లు, కమిషనరేట్‌లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ తోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం కలెక్టర్ల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్లు విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి, సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు సంక్షేమ పథకాలు కొన్ని జిల్లాల్లో కింది స్థాయి వరకు వెళ్లడం లేదనీ.. రైతు భరోసా అభిప్రాయ సేకరణ కోసం జిల్లాలకు వెళ్లినప్పుడు ఈ విషయం అర్థమైందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని పది లక్షలకు పెంచడం, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలపై విస్తృతంగా ప్రచారం చేసి అర్హులందరికీ ఆ పథకాలు అందేలా చూడాలని ఆదేశించారు. ఇది ప్రజా పాలన, ప్రజా ప్రభుత్వం అనే సందేశాన్ని స్పష్టంగా ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లాలని సూచించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు విస్తృతంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే పలు సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతాయన్నారు. ఇక సమావేశ ఎజెండాలో తొమ్మిది అంశాలను చేర్చారు. ప్రధానంగా డ్రగ్ వ్యతిరేక ప్రచారం, వ్యవసాయం – కాలానుగుణ పరిస్థితులు, ఆరోగ్యం, లా & ఆర్డర్ సెక్యూరిటీ సంబంధిత సమస్యలు, మహిళా శక్తి, విద్య, ధరణి , ప్రజా పాలన , వన మహోత్సవంపై చర్చించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..