CM KCR: ఆగస్టు 2న హాలియాకు ముఖ్యమంత్రి కేసీఆర్.. అందుకే వస్తున్నారంటూ క్లారిటీ ఇచ్చిన మంత్రి..

|

Jul 28, 2021 | 3:59 PM

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 2వ తేదీన నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

CM KCR: ఆగస్టు 2న హాలియాకు ముఖ్యమంత్రి కేసీఆర్.. అందుకే వస్తున్నారంటూ క్లారిటీ ఇచ్చిన మంత్రి..
Cm Kcr
Follow us on

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 2వ తేదీన నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన వివరాలను మంత్రి జగదీష్ రెడ్డి బుధవారం నాడు మీడియాకు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 2వ తేదీన హాలియాకు వస్తారని, ఇక్కడి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. హాలియాలో ప్రగతి సమీక్షా కార్యక్రమంలో భాగంగా అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం అవుతారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన మంత్రి జగదీష్ రెడ్డి.. ఎన్నికల హామీల్లో భాగంగా అభివృద్ధిపై ప్రణాళికలు సిద్ధం చేసే విధంగా సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే కేసీఆర్ అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పర్యటన కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.

నాగార్జునసాగర్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో సీఎం కేసీఆర్ పలు హామీలను ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీలను నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ ఎమ్మెల్యేతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్న ముఖ్యమంత్రి.. ఇప్పుడు స్వయంగా అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆగస్టు 2వ తేదీన నాగార్జునసాగర్ నియోజకవర్గం మొత్తం పర్యటించనున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా అభివృద్ధి పనులపై ఆరా తీయనున్నారు.

ఇదిలాఉంటే.. నల్లగొండ జిల్లాలోని మనుగోడులో టెన్షన్ వాతావరణం నెలకొంది. మునుగోడు పరిధిలో ఇవాళ జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలోనే ‘దళిత బంధు’ కోసం చలో మునుగోడు కార్యక్రమానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ పిలుపు నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. దాంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు పలుచోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టారు. పలువురిని అరెస్ట్ చేశారు.

Also read:

Talasani Srinivas: ఆ తర్వాతే గొల్ల, కుర్మలకు స్వాతంత్ర్యం వచ్చింది.. రాజేందర్‌ది వ్యక్తిగత సమస్య: మంత్రి తలసాని

Corona third wave alert : బీ కేర్‌ఫుల్..! కరోనా కేసులు తగ్గుతున్నాయని నిర్లక్ష్యం చేస్తున్నారా? నిపుణులు హెచ్చరిక

Viral Photos : గాయపడిన కుక్క కోసం చిన్నారుల ఆవేదన..! హార్ట్ టచింగ్ ఫొటోస్..