Telangana Cm Kcr: ఆ మాట చెబితే ఎవరూ నమ్మలేదు.. గోదావరి జలాలపై సీఎం కేసీఆర్ ఆసక్తికర కామెంట్స్..

|

Jul 04, 2021 | 8:07 PM

Telangana Cm Kcr: సిరిసిల్ల పర్యటన సందర్భంగా గోదావరి జలాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Telangana Cm Kcr: ఆ మాట చెబితే ఎవరూ నమ్మలేదు.. గోదావరి జలాలపై సీఎం కేసీఆర్ ఆసక్తికర కామెంట్స్..
Cm Kcr
Follow us on

Telangana Cm Kcr: సిరిసిల్ల పర్యటన సందర్భంగా గోదావరి జలాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా అమృత దార లాగా ఉంటుందని నాడు తాను చెబితే ఎవరూ నమ్మలేదన్నారు. కానీ ఇప్పుడు అది సాక్షాత్కారమైందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆదివారం నాడు సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా రూ. 210 కోట్ల విలువ గల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘గోదావరి నది పారేది ఇక్కడ.. అలాంటిది ఇక్కడి జలాలు ఎలా ఎండుతాయి?’ అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో మానేరు, గోదావరి, వరద కాలువలు జీవ నదుల్లా మారాయన్నారు. 180 కిలోమీటర్ల గోదావరి సజీవం అయ్యిందని పేర్కొన్నారు. ఈ నీళ్ల వల్ల భూగర్భ జలాలు సైతం పెరిగాయన్నారు.

ఇంతకు ముందు 30 లక్షల కరెంట్ మోటార్లు ఉన్నాయన్న సీఎం కేసీఆర్.. ఎన్నో బోర్లు వేస్తే గానీ కొన్ని నీళ్లు వచ్చేవని పేర్కొన్నారు. కర్మగాలి ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే మనిషికి రూ. 500 వేసుకుని బాగుచేయించుకునే వారు. రైతుల బాధలు తొలగిపోవాలనే 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని సీఎం తెలిపారు. కొందరు విపక్ష నేతలు ‘మీరు గనుక 24 గంటల కరెంట్ ఇస్తే.. టీఆర్ఎస్ కండువా కప్పుకుంటాం’ అని అన్నారని ఆయన గుర్తు చేశారు.

ఇదిలాఉండగా.. రైతు బీమా మాదిరిగానే చేనేత కార్మికులకు కూడా రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. చేనేతలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ పనిమీద ఉంటారని అన్నారు. అలాగే రూ. 5 కోట్లతో కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇస్తామన్నారు. ఇదేసమయంలో కరోనా వైరస్ ప్రభావంపై సీఎం కేసీఆర్ పలు కామెంట్స్ చేశారు. కరోనా జనాలను చాలా ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ విధించడం వల్ల చాలామంది ప్రజల జీవితాలు అస్తవ్యస్థం అయ్యాయని బాధను వ్యక్తపరిచారు. ఆ మధ్య కాలంలో మిడతల దండు అని కూడా ప్రచారం జరిగిందన్న ఆయన.. మిడతల దండు అత్యంత ప్రమాదకరం అని పేర్కొన్నారు. అదృష్టం బాగుండి ఇక్కడికి ఆ మిడతల దండు రాలేదన్నారు. మనిషి పుట్టక ముందే వైరస్‌లు పుట్టాయని, ప్రకృతికి అనుకూలంగా మనుషులకు ఎలాంటి నష్టం వాటిల్లదని సీఎం కేసీఆర్ చెప్పారు. అదే ప్రకృతిని ధ్వంసం చేస్తుంటే.. ఇలాంటి విపరీత అనార్థాలే జరుగుతాయని అన్నారు.

Also read:

TeamIndia: గిల్ గాయం దాచడం ఆశ్చర్యంగా ఉంది: టీమిండియా మాజీ క్రికెటర్‌ సాబా కరిమ్‌

Wimbledon 2021: మూడో రౌండ్లోకి సానియా మీర్జా – రోహన్ బోపన్న జోడీ..!

Monsoon Health Tips: వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..